హైదరాబాద్ : ఒకటా రెండా ఏకంగా రూ. 210 కోట్ల స్కాం ఆరోపణలు ఎదుర్కొంటోంది సింగర్ మంగ్లీ. తన స్వస్థలం రాయలసీమ. కానీ అనూహ్యంగా తెలంగాణకు వచ్చింది. బంజారా కమ్యూనిటీకి చెందినది కావడంతో మెల మెల్లగా జర్నలిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత పాపులర్ అయ్యింది. అక్కడి నుంచి గొంతు బాగుండడంతో పాటలు పాడటం మొదలు పెట్టింది. ఇక ఆనాటి నుంచి నేటి దాకా వెనక్కి చూసుకోలేదు. తెలంగాణ జానపద పాటలతో దుమ్ము రేపింది. తనతో పాటు తన సోదరిణి కూడా ఊ అంటావా మావ అంటూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ ఒక్క పాటతో తను కూడా పాపులర్ అయ్యింది దేశ వ్యాప్తంగా.
తెలుగు, కన్నడ సినీ రంగాలలో మంగ్లీ , సోదరి కూడా పాటలు పాడుతూ మరింత జనాదరణ పొందారు. ఈ తరుణంలో తను ఓ కంపెనీ, పబ్, స్కూల్ పెడతానంటూ మంగ్లీతో పాటు సోదరుడు , ఇంకొందరు కలిసి మాయ మాటలు చెప్పి కోట్లు కొల్లగొట్టినట్లు విమర్శలు ఉన్నాయి. బాధితులు సైతం బయటకు వచ్చారు. దీంతో మంగ్లీ నోరు విప్పింది. తాను అమాయకురాలినని, తనకు ఏ పాపం తెలియదంటూ బుకాయించే ప్రయత్నం చేస్తోంది. పంజాగుట్ట పీఎస్ లో తనపై కేసు నమోదు అయ్యింది. ఈ సందర్బంగా మంగ్లీ మాట్లాడుతూ తనకు పాటలు పాడటం తప్ప స్కాంలు చేయడం తెలియదని వాపోయింది. తాను తప్పు చేసి ఉంటే ఎలాంటి శిక్షకైనా సిద్దంగా ఉన్నానని అన్నారు. డబ్బున్న కుటుంబం నుంచి రాలేదని, పేదరికం నుంచి వచ్చానని, డబ్బు విలువ బాగా తెలుసన్నారు.
