అమరావతి : రాష్ట్రంలో నదులను అనుసంధానం చేయడంలో దివంగత ఇంజనీర్ డాక్టర్ కెఎల్ రావు చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. సోమవారం డాక్టర్ కెఎల్ రావు వర్ధంతి. ఈ సందర్బంగా సోమవారం సచివాలయంలో ఆయన చిత్ర పటానికి మంత్రి నిమ్మల రామానాయుడు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రావు చేసిన సేవలను గుర్తు చేశారు. ఆయన లేక పోతే నదుల అనుసంధానం జరిగి ఉండేది కాదన్నారు. కార్యక్రమంలో పాల్గొన్నారు ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్, అడ్వైజర్వెం కటేశ్వరరావు, ఈఎన్సీలు నరసింహమూర్తి, వరప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు. దేశ ఇరిగేషన్ రంగంలో డాక్టర్. కె.ఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయం అని ప్రశంసించారు నిమ్మల రామానాయుడు.
హీరాకుడ్, శ్రీశైలం, నాగార్జున సాగర్, వంటి అనేక బహుళార్దక సాధక ప్రాజెక్టుల రూపకల్పనలో కె.ఎల్.రావు ప్రధాన పాత్ర పోషించారని చెప్పారు. దేశంలో 50 ఏళ్ళ క్రితమే నదుల అనుంధానంలను ప్రతిపాదించిన దార్శనికుడు డాక్టర్ కె.ఎల్.రావు అని గుర్తు చేశారు. ఆనాడు మాజీ , దివంగత ప్రధాని వాజ్ పేయ్ , నేడు మోదీ, చంద్రబాబు నాయుడులు నదుల అనుసంధానం చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళుతున్నారని చెప్పారు నిమ్మల రామానాయుడు. రాష్ట్రంలో మొదటిగా పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణానదికి తరలించి నదుల అనుసంధానం చేసిన దార్శనికుడు చంద్రబాబు అని కొనియాడారు . 1300 కోట్లతో పట్టిసీమ నిర్మిస్తే, 50 వేల కోట్ల ఆదాయం తీసుకొచ్చిందన్నారు.