రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో రూ.10 లక్షల కోట్లు

పెట్టుబడులు మా లక్ష్యం అన్న మంత్రి నారా లోకేష్

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్ న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో నమ్మకమైన గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడం మా ధ్యేయం అన్నారు మంత్రి నారా లోకేష్‌. ప్రపంచ న్యూక్లియర్ ఎనర్జీ పరిశ్రమ కొత్త దశలోకి ప్రవేశిస్తున్ననేపథ్యంలో ఇది కీలకంగా మారగలదని పేర్కొన్నారు. న్యూక్లియర్ ఎనర్జీ ఇనిస్టిట్యూట్ (NEI), యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరం (USISPF) సంయుక్తంగా యూఎస్ ఎగ్జిక్యూటివ్ న్యూక్లియర్ మిషన్ టు ఇండియా పేరిట యూఎస్ న్యూక్లియర్ ప్రతినిధులతో ఢిల్లీలో నిర్వహించిన సదస్సుకు మంత్రి నారా లోకేష్ అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి యూఎస్ – ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ నివేదిత మెహ్రా స్వాగతం పలుకగా, న్యూక్లియర్ ఎనర్జీ ఇన్ స్టిట్యూట్ ప్రెసిడెంట్ , సీఈవో మారియా కోర్సినిక్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, తదుపరితరం రియాక్టర్ సిస్టమ్స్ వంటి ఆధునిక న్యూక్లియర్ సాంకేతికతలు, మాడ్యులర్ తయారీ, సప్లయ్ చైన్ పంపిణీ, స్కేలబుల్ వినియోగం నమూనాలకి విస్తృత అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం వ్య‌క్తం చేశారు నారా లోకేష్. భార‌త్ లో ఇంజనీరింగ్ ప్రతిభ, తయారీ రంగంలో విస్తృతి, ఖర్చు విషయంలో పోటీతత్వం ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు పారిశ్రామిక ఇన్‌‌ఫ్రా, పోర్ట్స్, లాజిస్టిక్స్ కనెక్టివిటీ, అమలు సామర్థ్యాన్ని కలిగి ఉండ‌డం అద‌న‌పు బ‌లంగా మార‌నుంద‌ని చెప్పారు నారా లోకేష్. ఇది భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్ కు ఒక చరిత్రాత్మక అవకాశాన్ని కల్పిస్తుంద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వం మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌పై ఎక్కువ‌గా దృష్టి సారిస్తుంద‌ని చెప్పారు మంత్రి. దీనిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.

Leave A Reply

Your Email Id will not be published!