ముంబై : ప్రముఖ భారతీయ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ మనోహర్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ సారథ్యంలో ఇటీవలే ముంబై వేదికగా కీలక సమావేశం నిర్వహించింది. ఎవరూ ఊహించని రీతిలో ప్రస్తుతం ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు నాయకుడిగా ఉన్న శుభ్ మన్ గిల్ కు వన్డే క్రికెట్ జట్టుతో పాటు టెస్టు జట్టుకు స్కిప్పర్ గా ప్రకటించింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సెలెక్షన్ కమిటీ ఎందుకని సంజు శాంసన్ ను వన్డే జట్టుకు ఎంపిక చేయలేదంటూ మండిపడుతున్నారు. సంజు శాంసన్ ఫ్యాన్స్ తో పాటు మాజీ క్రికెటర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ రంగంలో 10 ఏళ్లకు పైగా అనుభవం కలిగి ఉన్నాడు శాంసన్. ఇదే క్రమంలో ఈ ఏడాది ఇండియా, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను భారత్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు సంజు శాంసన్. తను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
ఇదిలా ఉండగా తాజాగా మరో కీలక అప్ డేట్ వచ్చింది. టి20 ఇండియా జట్టుకు సూర్య కుమార్ యాదవ్ ను కెప్టెన్ గా నియమిస్తున్నట్లు సమాచారం. దీనిపై తీవ్రంగా స్పందించాడు గవాస్కర్. సెలెక్టర్లు సూర్యకుమార్ యాదవ్‌ను టీ20ల నుండి తొలగించాలని అనుకుంటున్నారని విన్నాను. అది నిజమైతే, ఎలాంటి సంకోచం లేకుండా సంజు సామ్సన్‌ను కెప్టెన్‌గా ప్రకటించాలని అని కోరాడు. ఎందుకంటే అతను గత 10 ఏళ్లుగా భారత్ తరఫున టీ20లు ఆడుతున్నాడు. ఆ ప్రపంచ కప్‌లో అతను ఆడిన తీరు చూస్తే, ఒక ఆటగాడిగా చాలా పరిణతి చెందినట్లు కనిపించాడు. ఐపీఎల్‌లో కూడా అంతే, కాబట్టి టీ20 కెప్టెన్సీకి అతని కంటే ఎక్కువ అర్హుడు మరొకరు లేరని అన్నాడు.