సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రా రాజకీయ నేత‌ల‌ ఏజెంట్

అధికారంలోకి రాగానే ఆంధ్రా నాయకుల విగ్రహాలు పార్సల్

హైదరాబాద్: తెలంగాణ అమరుల ఆకాంక్షలు, ఉద్యమకారుల పోరాటం ఫలితంగా ఏర్పడిన తెలంగాణపై ఆంధ్రా నాయకుల పెత్తనాన్ని సహించబోమని టీఆర్ఎస్ ఛీప్ కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో జరిగిన “ఉద్యమకారుల ఆకాంక్షలు – సాధన” పై రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత మాట్లాడారు. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ ఎలాంటి విబేధాలు లేకుండా కలిసే ఉన్నారని గుర్తు చేశారు. కానీ రాజకీయ నాయకులే తెలంగాణ ఆస్తిత్వంపై దాడి చేస్తూ పెత్తనం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ రక్షణ సేన మాత్రమే కాపాడుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి రాగానే ఇక్కడ ఉన్న ఆంధ్రా నేతల విగ్రహాలను ఆంధ్రాకు పార్సల్ చేస్తామని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు.

తెలంగాణలో ఆంధ్రా రాజకీయ నేతల ఏజెంట్ సీఎంగా ఉండటంతో మళ్లీ ఈ ప్రాంతంలో కుట్రలు మొదలు పెట్టారని విమర్శించారు. ఆంధ్రాలో 12 ఏళ్లు గడిచిన రాజధాని నిర్మాణం చేతకాక ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మన అస్తిత్వం పై దాడి చేస్తూ వారి సంస్కృతిని రుద్దుతామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ తల్లి మీద కన్నేస్తే ఊరుకునే తెలంగాణ కాదన్నారు. తమతో పెట్టుకున్న వాళ్లెవరు బాగు పడలేదని…ఇప్పటికే ఒకసారి పెట్టుకుంటే తెలంగాణ సాధించు కున్నామని గుర్తు చేశారు. మళ్లీ తమతో పెట్టుకుంటే పళ్లు రాలుతాయని హెచ్చరించారు. టీఆర్ఎస్ 2.0 అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని హెచ్చరించారు.

Leave A Reply

Your Email Id will not be published!