అమెరిక‌న్ సైనికుల మృతి బాధాక‌రం : డొనాల్డ్ ట్రంప్

మ‌ధ్య ప్రాచ్యంలో కొన‌సాగుతున్న తీవ్ర ఉద్రిక్త‌త

అమెరికా : మ‌ధ్య ప్రాచ్యంలో యుద్ద వాతావ‌ర‌ణం కొన‌సాగుతోంది. ఇరాన్ పై ఏక‌ప‌క్షంగా అమెరికా సేన‌లు దాడుల‌కు దిగ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది ఇరాన్. ఇప్ప‌టికే ప్ర‌తీకార చ‌ర్య‌ల‌కు దిగింది. ఒప్పందం మేర‌కు అమెరికా త‌న దాడుల‌ను గ‌నుక నిలప‌క పోతే స‌ర్వ నాశ‌నం చేస్తామ‌ని హెచ్చ‌రించింది. ఈ త‌రుణంలో జోర్డాన్‌లో ఇద్దరు అమెరికన్ సైనికుల మృతిపై తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయ‌న తీవ్రంగా స్పందించారు. ఇలా జరగడం మాకు ఏమాత్రం ఇష్టం లేదు, ఇది దేశ సేవలో జరిగిన త్యాగం అని ట్రంప్ పేర్కొన్నారు. జోర్డాన్‌లోని అల్-అజ్రాక్ ఎయిర్ బేస్‌పై ఇరాన్ దాడుల తర్వాత ఇద్దరు త‌మ సైనికులు మరణించడం ప‌ట్ల తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు ట్రంప్. దేశ సేవలో ఉన్నవారు ఎదుర్కొనే ప్రమాదాలకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.

ఇరాన్ అణు ఆయుధాన్ని పొందేందుకు అనుమతించ కూడదని కూడా ఆయన పునరుద్ఘాటించారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి, డ్రోన్ దాడులను అడ్డుకునే చర్యల సమయంలో జోర్డాన్‌లో అమెరికన్ సైనికులు మరణించారని, మరొకరు గల్లంతయ్యారని సెంటకామ్ ధృవీకరించింది. ఈ నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా సమన్వయంతో కూడిన రక్షణ చర్యల్లో విధులు నిర్వర్తిస్తుండగా జూలై 17న ఈ సైనికులు మరణించారు. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు , డ్రోన్ల దాడుల నుండి రక్షణ కల్పించే క్రమంలో, అమెరికా సెంట్రల్ కమాండ్, భాగస్వామ్య దళాల కార్యకలాపాల్లో విధులు నిర్వర్తిస్తుండగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌న్నారు. దీనిని ఉపేక్షించే ప్ర‌స‌క్తి లేద‌ని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు ఇరాన్ కు.

Leave A Reply

Your Email Id will not be published!