వలస కార్మికులకు పరిహారం ఇవ్వలేం : కేంద్రం
వలస కార్మికులకు పరిహారం ఇవ్వలేం : కేంద్రం
Migrants position in Covid 19 In India :
కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులు ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రధాని మోదీ లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించిన తర్వాత వేలాది మంది స్వస్థలాలకు పయనమయ్యారు.
సొంతూళ్లను చేరుకునే క్రమంలో అనేక మంది ప్రాణాలు విడిచారు.
కాసేపట్లోనే ఇంటికి చేరుకుంటామనగానే కన్నుమూసిన ఘటనలు కోకొల్లలు.
పొట్టచేత పట్టుకుని పట్నాలకు వచ్చిన కూలీలంతా పరాయి చోట పనిదొరక్క పస్తులతో కాలం వెళ్ల బుచ్చలేక ఇక్కడ కాలం చేసే కంటే సొంతూళ్లో కలో గెంజో తాగుదామని, కనీస రవాణా సౌకర్యాలు లేకపోవటంతోనిద్రాహారాలు లేకుండా వందల కిలోమీటర్లు కాలినడక వెళుతూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న వైనాలు మనకళ్లకు కనిపించాయి.
మరికొందరు కూలీలు(Migrants) లారీలు, ట్రక్కుల్లో ప్రయాణిస్తూ, రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ కోకొల్లలు.
అయితే ఇలా మరణించిన వారికి వీరికి పరిహారం ఇవ్వాలంటూ వస్తున్న డిమాండ్‌ని తోసిపుచ్చుతూ పార్లమెంట్‌లో కేంద్రం చేసిన ప్రకటన పై
సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎంత మంది వలస కార్మికుల చనిపోయారో వివరాలు లేవు కాబట్టి..
వారికి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సోమవారం పార్లమెంట్‌లో లిఖితపూర్వక సమాధానం ఇవ్వటంతో ప్రతిపక్షాలు షాక్ తిన్నాయి.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కోటి మందికిపై వలస కార్మికులు స్వస్థలాలకు చేరుకున్నారని అయితే…
ఎంత మంది వలస కార్మికులు సొంతూళ్లకు వస్తూ ఎందరు చనిపోయారు? బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం లేదా పరిహారం చెల్లింపులు? గురించి కేంద్రం వద్ద సమాచారం ఏమైనా ఉందా అని విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్ పై విధంగా సమాధానం ఇచ్చారు.
దీనిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
వలన కార్మికుల మరణాలపై సమాచారం లేదు కాబట్టి పరిహారం చెల్లించాల్సిన అవసరంలేదంటూ కేంద్ర మంత్రి ప్రకటించడం తనను విస్మయానికి గురిచేసిందని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ దుయ్యబట్టారు.
‘కొన్నిసార్లు మేము గుడ్డివాళ్ళమని నేను భావిస్తున్నాను లేదా ప్రతి ఒక్కరినీ పరిగణనలోకి తీసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది’ అని ఎద్దేవా చేశారు..
