అమరావతి : వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు కాంగ్రెస్ తో హాట్ లైన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బహిరంగంగా భాజపాతో ఉంటూ తెరచాటున కాంగ్రెస్ తో ఉంటారని అన్నారు. మోసపూరిత రాజకీయాలు చేయటంలో చంద్రబాబు నెంబర్ ఒన్ అని పేర్కొన్నారు. బీజేపీని చంద్రబాబు తన రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాదులో ఎన్టీఆర్ విగ్రహాన్ని కాంగ్రెస్ సీఎం ఆవిష్కరించటం సిగ్గు చేటు అన్నారు. కాంగ్రెస్ సీఎంకి టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలకడం విడ్డూరంగా ఉందన్నారు అంబటి రాంబాబు. ఏపీలో చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ బీ టీమ్ గా మారిందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ కు టీడీపీ బీ టీమ్ అన్నారు. ఇలాంటి అనైతిక రాజకీయాలు చేయటంలో చంద్రబాబు దిట్ట అన్నారు .చంద్రబాబు వైఖరిని బీజేపీ బాగా అబ్జర్వ్ చేస్తోందన్నారు అంబటి రాంబాబు.
రాజ్యసభలో బీజేపీకి సీటు ఇవ్వనని చంద్రబాబు అనటం అందుకు సంకేతం అన్నారు .చీరలిచ్చి మహిళలను మహానాడుకు తీసుకెళ్లారు. డబ్బులిచ్చి జనాన్ని తీసుకెళ్లారంటే టీడీపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు మాజీ మంత్రి. మహానాడులో చంద్రబాబును 25%, లోకేష్ ను 75% పొగిడారన్నారు. మెగా డీఎస్సీ పేరుతో పోస్టులు అమ్ముకున్న వ్యక్తి నారా లోకేష్. ఆ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. అసలు టీడీపీ పెట్టినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ లో ఉన్నారన్నారు. కాంగ్రెస్ ను వెన్నుపోటు పొడిచి టీడీపీలో చేరారు. తర్వాత ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పుందేశ్వరి, నారా రామ్మూర్తి నాయుడుని కూడా రాజకీయాల కోసం వాడుకున్న నీచ చరిత్ర చంద్రబాబుదన్నారు.