Chandra Babu: జ‌గ‌న్ అస్తవ్యస్త నిర్ణ‌యాల‌తో ఏపి భ‌విష్య‌త్‌ అభాసుపాలు

AP futures up with chaotic decisions

Chandra Babu: 21 రోజుల్లో విచారణ, మరణ శిక్ష వంటి కఠినమైన చట్టాలు రూపొందించాం అని డప్పుకొట్టుకుని, దిశ పోలీసు స్టేష‌న్లు సైతం ఆర్భాటంగా ఆరంభించిన‌ రాష్ట్ర ప్రభుత్వం తీరా దిశ చట్టం పార్ల‌మెంట్ ఆమోదం కొసం పంపితే కేంద్రం బ్రేకులు వేయ‌టం చూస్తుంటే సిఎం జ‌గ‌న్ అవగాహనాలేమితో రాష్ట్రానికి నష్టం చేకూరుస్తున్న ట్టు క‌నిపిస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు టీడీపీ అధినేత చంద్రబాబు. అసెంబ్లీ ముగిసిన తర్వాత ఏర్పాటు చేసిన‌ ప్రెస్ మీట్ లో ఆయ‌న మాట్లాడారు. దశా దిశా లేని విధంగా అద‌రాబాద‌రాగా త‌యారు చేసి చివ‌ర‌కి దాన్ని ర‌ద్దు చేసుకునే ప‌రిస్థితి తీసుకొచ్చారంటే అర్ధం పర్ధం లేకుండా ఉన్న‌ ప్రభుత్వ విధానలే కార‌ణ‌మ‌ని చెప్పారు. నిర్భయ చట్టం లోని విధానాల ప్రకారం అమలయ్యేలా మార్పలు తీసుకువ‌చ్చి, చేసిన‌ చట్టాన్ని కేంద్రం తిప్పి పంపడంతో అందులో భారీ స్థాయిలో మార్పులు చేపడ‌తామ‌ని చెప్పి ర‌ద్దు చేసారంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చ‌ని వ్యాఖ్యానించారు. చట్టాల గురించి అవగాహాన లేని వ్యక్తి కొత్త చట్టాల రూపకల్పన చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ‘దిశ చట్టం’ ఒక ఉదాహరణ మాత్రమే అని చెప్పారు. ఆమాత్రం దానికి కొత్త చట్టం పేరుతో హడావిడి చేశారని చంద్రబాబు పేర్కోన్నారు.

అధికారంలోకి రాగానే ఇసుక విధానం లో మార్పులు తీసుకువ‌స్తామ‌ని చెప్పి నేటికి ప‌లు విధానాలు ప్ర‌క‌టించి భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌పై క‌క్ష సాధిస్తోంద‌ని ఆరోపించారు అవగాహాన లేని వ్యక్తి ముఖ్యమంత్రి పరిపాలన సాగిస్తే ఇలాగే ఉంటుందని చంద్రబాబు ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు.

అసలే కరోనాతో అల్లాడుతున్న ప్రజలకు, జగన్ సర్కార్ పన్నుల భారం వేయడం దారుణమని ఉద్యోగ కల్పన గురించి ఆలోచన చేయడం మానేసి, ప్రభుత్వ ఆదాయం పేరుతో ఇంటి పన్ను, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల… ఇలా ఒక్కటేమిటి అన్నింటినీ పెంచుకుంటూ పోతున్నారు.. ప్రతిపక్షాలను ఎదుర్కోలేక, వారడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకే ఇలాంటి సస్పెండ్ లాంటి చర్యలకు పాల్పడినట్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.

పంటల బీమా లెక్కల్లో కూడా అన్ని అసత్యాలే ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం కట్టింది కేవలం 26 లక్షలు, కానీ ప్రభుత్వం 50 లక్షలుగా చూపిస్తున్నారని , రాత్రికి రాత్రి బీమా సొమ్ములు విడుద‌ల చేస్తార‌ని ఎద్దేవా చేసారు చంద్ర‌బాబు. త‌మ ప్ర‌భుత్వ‌మే సొంత బీమా సంస్ధ పెడుతోంద‌ని ప్ర‌క‌టించుకున్న సిఎం అందుకు ఎలాంటి అనుమ‌తులు తీసుకోలేద‌న్న విష‌యం బైట ప‌డ‌గానే ఏం చెప్పాలో పాలుపోని ప‌రిస్థితి అని వ్యాఖ్యానించారు. వీటికి తోడు ప్రతిపక్షాలపై దాడులు, కక్ష సాధింపు చర్యలకు అడ్డులేకుండా పోతుంది. వారిలా మేమేన్నడు ప్రవర్తించలేదన్నారు. సామాజిక న్యాయం పాటిస్తూ, ప్రభుత్వ ఫలలాలను పార్టీలకతీతంగా ప్రజలకు అందజేశామని గత ప్రభుత్వ విధానాన్ని గుర్తుచేశారు.

No comment allowed please