చెన్నై : తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన ప్రకటన చేశారు. పాలనా పరంగా తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు కిలోమీటర్ దూరంగా మద్యం దుకాణాలు ఉండాలని ఆదేశించారు. ఇప్పటికే 717 రిటైల్ షాపులు మూసి వేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి 2 వారాలు గడువు ఇస్తున్నామని, స్వయంగా తీసి వేయాలని లేక పోతే చర్యలు తప్పవన్నారు సీఎం. తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. TASMAC దుకాణాల వద్ద 21 ఏళ్లలోపు వ్యక్తులకు మద్యం విక్రయించకుండా కఠిన నిషేధాన్ని విధించారు.
టీఏఎస్ఎంఏసీ యంత్రాంగం జారీ చేసిన ప్రకటన ప్రకారం, ఈ నిబంధనను ఉల్లంఘించి మైనర్లకు మద్యం విక్రయిస్తే, సంబంధిత విక్రయ సిబ్బంది, పర్యవేక్షకులు , బార్ యజమానులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి చేసే ప్రతి అర్థంలేని వ్యాఖ్యకూ బదులివ్వాల్సిన అవసరం లేదన్నారు. కేవలం 4 రోజుల్లోనే ముఖ్యమంత్రి విజయ్ ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకువచ్చే అత్యంత వేగవంతమైన పాలనను అందించారు.సామాన్యుల కోసం 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను మంజూరు చేశారు . విద్యార్థులు, మహిళల రక్షణార్థం దుకాణాలను మూసి వేశారు. ప్రజాభీష్టానికి గౌరవం ఇస్తూ 24 గంటల్లోనే OSD నియామకాన్ని రద్దు చేశారు. గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు నీట్ పరీక్షను రద్దు చేసే దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. 21 ఏళ్లలోపు వారికి మద్యం విక్రయించడంపై కఠిన నిషేధం విధించారు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ .