అవినీతి ప‌రులకు ద‌డ పుట్టిస్తున్న సీఎం విజ‌య్

సెంథిల్ బాలాజీపై చ‌ర్య‌ల‌కు సిద్ద‌మైన టీవీకే చీఫ్

చెన్నై : త‌మిళ‌నాడులో సీఎం విజ‌య్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు స‌ర్దుకుంటున్నారు. ఆయ‌న సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన స‌మ‌యంలోనే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇది ప్ర‌జ‌ల ప్ర‌భుత్వం. ఎవ‌రికీ ఒక్క రూపాయి కూడా అద‌నంగా, లంచంగా ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఆ దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో అత్యంత నిబ‌ద్ద‌త‌, ద‌మ్మున్న పోలీస్ ఆఫీస‌ర్ గా పేరు పొందిన ఆస్రా గార్గ్ ను త‌మిళ‌నాడు రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియ‌మించారు. దీంతో అవినీతి, అక్ర‌మార్కుల గుండెళ్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి. తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకోవ‌డం చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది.

టీవీకే ప్రభుత్వం అవినీతి రహిత పాలనను అందిస్తుందని ఆయన మొదటి నుంచీ ప్రజలకు వాగ్దానం చేశారు. ఎవరైనా అధికారాన్ని దుర్వినియోగం చేసినా, ప్రజాధనాన్ని దోచుకున్నా, వారు ఎవరైనప్పటికీ సరైన చట్టప రమైన చర్యలను ఎదుర్కోవాల్సిందేన‌ని ప్ర‌క‌టించారు. ఇప్పుడు, ఉద్యోగాల కోసం డబ్బుల కేసులో వి. సెంథిల్ బాలాజీపై మరోసారి విచారణ జరిపేందుకు అనుమతి కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో తదుపరి విచారణకు అనుమతి నిరాకరించడం వల్ల కోర్టు విచారణలు ఆలస్యం అయ్యాయని కూడా నివేదికలు చెబుతున్నాయి.

నివేదికల ప్రకారం, ఈడీ, సెంథిల్ బాలాజీ , ఆరోపిత కుంభకోణంలో ప్రమేయం ఉన్న ఇతరులపై విచారణను కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి కోరుతూ, సాక్ష్యాధారాలు, రహస్య పత్రాలను సమర్పించింది . నిజం చెప్పాలంటే, టీవీకే ప్రభుత్వం రాజకీయ జోక్యం లేకుండా పూర్తిస్థాయి విచారణకు అనుమతిస్తుందా లేదా అని ఇప్పుడు చాలా మంది ఎదురు చూస్తున్నారు .మాజీ మంత్రి కేఎన్ నెహ్రూతో సహా పెండింగ్‌లో ఉన్న ఇతర అవినీతి ఆరోపణలపై కూడా చర్యలు తీసుకోవాలని చాలా మంది ఆశిస్తున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!