హిమాచల్‌ప్రదేశ్‌లో ఆర్థిక సంక్షోభం

ముఖ్య‌మంత్రి సంచ‌ల‌న నిర్ణ‌యం

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ : అసంబ‌ద్ద నిర్ణ‌యాలు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని అత‌లాకుత‌లం చేశాయి. ఇదే గ‌నుక కంటిన్యూ అయితే దివాలా అంచున నిల‌బ‌డ‌నుందేని వాస్త‌వం. ప్ర‌భుత్వాన్ని న‌డిపించే ప‌రిస్థితి లేక పోవ‌డం ముఖ్య‌మంత్రి సుఖ్వీద‌ర్ సింగ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల జీతాల్లో వచ్చే 6 నెలల పాటు 30 శాతం కోత పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.
అయితే క్లాస్-3, క్లాస్-4 ఉద్యోగులకు జీతాల కోత నుంచి మినహాయింపు ఇస్తున్న‌ట్లు తెలిపారు. అప్పుల భారం, ఖజానా ఖాళీ కార‌ణంగా నిర్ణయం తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నారు సీఎం. కేంద్రం నిధులు తగ్గడం, పాత పెన్షన్ విధానం (OPS) అమలుతో ఆర్థిక ఇబ్బందులు ఏర్ప‌డ్డాయ‌ని తెలిపారు. దేశంలోనే జీతాల వాయిదాకు నిర్ణయించుకున్న తొలి రాష్ట్రంగా నిలిచింది హిమాచల్‌ప్రదేశ్ . ఇది అంద‌రినీ విస్తు పోయేలా చేసింది.

ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఉన్నతాధికారుల జీతాల్లో 30 శాతం కోత విధించడంతో ఉన్నతాధికారుల‌ను, ఉద్యోగుల‌ను తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేసింది. తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించేందుకు ఆరు నెలల పొదుపు చర్యగా పేర్కొంటూ, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారుల జీతాల్లో తాత్కాలిక కోత విధించాలని ఆదేశించింది. మ‌రో వైపు రాజకీయ అసమర్థతకు తాము మూల్యం చెల్లిస్తున్నామని అధికారులు, బ్యూరోక్రాట్లు ఆందోళన వ్యక్తం చేశారు . ఈ చర్య రాబోయే ఆర్థిక అత్యవసర పరిస్థితికి, తీవ్రమవుతున్న రుణ సంక్షోభానికి సంకేతమని ప్రతిపక్షం అంటోంది.

Leave A Reply

Your Email Id will not be published!