తెలంగాణ ఆర్టీసీ ఆస్తులు లక్ష కోట్లు..దీనిని ఆదుకోలేమా..!
ప్రభుత్వం నిర్వాకం ఆర్టీసీ కార్మికుల ఆగ్రహం
1) ప్రస్తుతం ఆర్టీసీ నష్టాల్లో ఉందని అంటున్నారు. దీనికి కారణాలు ఏవైనా. ప్రభుత్వం తలుచుకుంటే దీనిని పరిష్కరించడం చిటికెలో పని.
2) కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద (సీఎస్ఆర్ ) సామాజిక బాధ్యత కింద ప్రతి ఏటా 2 శాతం ఆయా కంపెనీలు, డబ్బున్న వాళ్లు సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరిన కంపెనీలు ఎన్నో ఉన్నాయి. ఆయా కంపెనీలన్నీ సీఎస్ఆర్ కింద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ఇచ్చేలా చేస్తే ఉన్న అప్పులు తీరి పోతాయి.
3) ఆర్టీసీ బస్సులు నిరంతరం (24 గంటలు) పాటు నడిచేలా చేస్తూ కొంత మేరకు ఇబ్బంది తొలగి పోతుంది.
4) ఆర్టీసీ సంస్థ పూర్తిగా మెకానిక్ లు, కండక్టర్లు, డ్రైవర్ల పై ఆధార పడి ఉంది. వీరికి పూర్తి భరోసా కల్పించాలి. వారికి తోడుగా ఉండాలి. వారి కుటుంబాలకు భరోసా కల్పించాలి.
5) ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా పని తీరు మెరుగు పర్చుకునేలా చేయాలి
6) మరింత పనితీరు మెరుగు పడేందుకు గాను ఆయా జిల్లాలకు చెందిన వారిని ఆయా ప్రాంతాల్లో పనిచేసేలా చూడాలి.
7) ఆర్టీసీ సంస్థలో పనిచేసే సిబ్బంది పిల్లలకు ఉచితంగా విద్య, వైద్యం అందించేలా చూడాలి. హైదరాబాద్ కు రాలేని పక్షంలో ఉన్న చోటనే ఉచితంగా వైద్యం అందిస్తే బావుంటుంది.
8) తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను గుర్తించాలి. ప్రాజెక్టులు, దేవాలయాలు ( యాదాద్రి, సరళాసాగర్, వేముల వాడ లాంటివి ) నేరుగా ఆయా జిల్లాల నుంచి హైదరాబాద్ నుంచి నడిపించాలి.
9) సిటీలో 100 రూపాయల టికెట్ తో రోజంతా తిరిగేలా చాన్స్ ఇచ్చారు. ఒక్క టికెట్ తో రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు ప్రయాణం చేసేలా మరో ధరను నిర్ణయిస్తే ఆదాయం పెంచుకోవచ్చు.
10) కార్గో సర్వీస్ ను బుక్ చేసిన వారి ఇళ్ల వద్దకే చేర్చేలా చూస్తే బాగుంటుంది.
11 ) ఆర్టీసీకి ఉన్న అప్పుల్ని ఈజీగా తీర్చే మార్గం ఒక్కటే ఆయా కంపెనీల నుంచి సీఎస్ఆర్ కింద తీసుకోవడం.
12 ) రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి ఎనలేని ఆస్తులు ఉన్నాయి. అవి అన్యాక్రాంతం కాకుండా చూడాలి. ప్రస్తుతం
ఈవీ (ఎలక్ట్రిక్ విద్యుత్ ) చార్జింగ్ స్టేషన్లకు గిరాకీ పెరుగుతోంది.
13 ) ఇందుకు సంబంధించి ప్రతి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ – ఐఓసీ లేదా ఓఎన్జీసీ తో అనుసంధానమై ఈ వీ స్టేషన్లను ఏర్పాటు చేస్తే కొంత మేరకు ఆదాయం సమకూరుతుంది.
14 ) ఆయా బస్టాండ్ లలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల నిధుల నుంచి ఉచితంగా శుద్ధ మంచినీటి వసతిని ఏర్పాటు చేయాలి.
15) ఇక బస్టాండ్ లలో నిర్వహిస్తున్న హోటల్స్ లేదా క్యాంటీన్లలో శుచి, శుభ్రత ఉండటం లేదు.
16) ఎంఆర్పీ ధరలకే వస్తువులను అమ్మేలా చూడాలి.
17) కూరగాయల మార్కెట్ ల వద్దకు పల్లె వెలుగు బస్సులు నడపాలి.
18) తక్కువ ధరకే ఆర్టీసీ బస్సులను ఎయిర్ పోర్టుకు, రైల్వే స్టేషన్ల వద్దకు నడిపించాలి.
19) ప్రభుత్వంతో మాట్లాడి కండీషన్, కంఫర్ట్ ఉన్న బస్సులను హైదరాబాద్ లో సైబరాబాద్ వద్ద కొలువు తీరిన ఐటీ కంపెనీలతో టై అప్ కావాలి. ఉద్యోగులను ఆయా కంపెనీల వద్దకు చేర్చేలా చూడాలి.
20) మెట్రోలో ప్రయాణం చేస్తున్న వారు బస్సుల్లో ప్రయాణించేలా టికెట్లు కేటాయించాలి.
21 ) చాలా చోట్ల టాయిలెట్లు లేవు బస్టాండ్ లలో.
22 ) తెలంగాణ నుంచి తిరుపతి, మంత్రాలయం, శ్రీశైలం, మహానంది, తదితర ప్రాంతాలు వెళ్లే వాళ్లు వేలల్లో ఉంటారు.
23 ) ఏపీఎస్ఆర్టీసీ సర్వ దర్శనం టికెట్లను రోజుకు 1000 మందికి బస్సులలోనే ఇస్తోంది. దయచేసి మీరు కూడా సీఎంతో మాట్లాడి తిరుపతి సర్వదర్శనం టికెట్లను తెలంగాణ ఆర్టీసీ బస్సులలో ఏర్పాటు చేస్తే బెటర్.
24 ) ఎవరైనా సంస్థలో రిటైర్డ్ అయిన వారు పని చేస్తున్నట్లయితే వెంటనే వారిని ఇంటికి పంపిస్తే బెటర్.
25 ) ఆధునిక టెక్నాలజీని టీఎస్ఆర్టీసీకి అనుసంధానం చేస్తే బావుంటుంది.
26) వేల కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. కొన్నింటిని ప్రభుత్వ అనుమతో లీజుకు ఇచ్చి వచ్చిన డబ్బులను ఆయా బ్యాంకులలో ఎఫ్‌డీగా పెట్టినట్లయితే వచ్చే వడ్డీతో సిబ్బందికి జీతాలు ఇవ్వవచ్చు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
27) సెలబ్రెటీస్ ( సినీ రంగానికి చెందిన నటీ నటులు ) ఉచితంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేయాలంటూ ప్రచారం చేయాలి.
28) బస్సుల్లో ప్రయాణం సురక్షితం..జీవితం ఆనంద దాయకం అన్న మెస్సేజ్ ఇవ్వాలి.
29) ఆయా ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీ, ఇంటర్ , పాఠశాలలకు ఆర్టీసీ బస్సులను నడిపితే కొంత మేరకు ఆదాయం సమకూర్చు కోవచ్చు.
30) అమెజాన్, ఫ్లిప్ కార్ట్ , స్నాప్ డీల్ కు చెందిన ఆర్డర్లు ఆర్టీసీ కార్గో ద్వారా తరలించేలా ఐటీ మినిస్టర్ తో మాట్లాడి అగ్రిమెంట్ చేసుకున్నట్లయితే కొంత ఆదాయం సమకూర్చుకోవచ్చు.
31 ) స్వాతంత్ర సమరయోధులకు ఉచితంగా, సీనియర్ సిటిజన్లకు హాఫ్ రేట్ తో ప్రయాణం చేసేలా చాన్స్ ఇవ్వగలరు.
32 ) ఎక్కడికైనా రాను పోను ఒకేసారి ఛార్జీ తీసుకునేలా ఆ నెలలో ఎప్పుడైనా ప్రయాణం చేసేలా నిర్ణయం తీసుకుంటే అదనపు ఆదాయం పొందవచ్చు.
33) సోషల్ మీడియాలో ప్రతి ఒక్క ఉద్యోగి తన బాధను తెలియ చేసుకునే సౌకర్యం కల్పించాలి.
34 ) ఆయా బస్టాండ్ ప్రాంగణంలో పేదలు, మధ్య తరగతి ప్రజలు ప్రయాణం చేస్తుంటారు. ప్రతి చోటా అక్షయపాత్ర ద్వారా 5 రూపాయల భోజనం ఏర్పాటు చేస్తే బావుంటుంది.
35) కార్పొరేట్ కంపెనీలకు కటబెట్టడం బంద్ చేయాలి. ఆర్టీసీకే ఎలక్ట్రిసిటీ బస్సులను నిర్వహించేలా చూడాలి.
