బీజేపీ ర్యాలీతో ట్రాఫిక్ జామ్ మంత్రిపై మ‌హిళ క‌న్నెర్ర‌

సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు

ముంబై : ముంబైలో ఓ మ‌హిళ సంచ‌ల‌నంగా మారారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో మ‌హిళా సంక‌ల్ప్ పేరుతో ర్యాలీ చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. ఓ సామాన్య మ‌హిళ‌ను ఇది తీవ్ర ఇబ్బందికి గురి చేసింది. త‌న బిడ్డను పికప్ చేసుకోవడానికి వెళ్తున్న ఆమె గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకు పోవడంతో ర్యాలీలో ఉన్న మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మీ నిరసనలేవో గ్రౌండ్‌లో చేసుకోండి. జనాన్ని ఎందుకు ఇబ్బంది పెడతారంటూ త‌న‌ను నిలదీసింది. ర్యాలీ కారణంగా ట్రాఫిక్‌కు కారణం అవుతున్నందుకు బీజేపీ మంత్రిపై మహిళ ఆగ్రహం వ్య‌క్తం చేశారు.

ఇక్కడి నుండి మీరు త‌క్ష‌ణ‌మే వెళ్లిపోండి. మీరు ట్రాఫిక్ జామ్‌కు కారణమవుతున్నారని ఫైర్ అయ్యారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించే బదులు, సమీపంలోని బహిరంగ ప్రదేశంలో ర్యాలీ ఎందుకు నిర్వహించలేదని ఆమె ప్రశ్నించారు ముంబైలోని వర్లీలో బీజేపీ ర్యాలీ కార‌ణంగా ట్రాఫిక్ కు అంత‌రాయం ఏర్ప‌డింది. మహాజన్ ర్యాలీలో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, బీజేపీ నిరసన వ్యూహాలపై విమర్శలను మరింత పెంచుతోంది.

మహాజన్ ఆమెను శాంతపరచడానికి ప్రయత్నం చేశారు . ఆమె ప‌ట్టించు కోలేదు. త‌మ ఇబ్బందిని అర్థం చేసుకోక పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. మీకు అర్థం కాలేదా? మీకేమైంది? వందలాది మంది వేచి ఉన్నారు అని అన్నారు. ఒక పోలీసు అధికారి జోక్యం చేసుకోవాల‌ని చూశాడు. దానిని ఆమె ప‌ట్టించు కోలేదు. తనతో ఎవరూ మాట్లాడవద్దని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!