అహ్మదాబాద్ : సన్ రైజర్స్ కు అహ్మదాబాద్ ఫోబియా ఇంకా వెంటాడుతూనే ఉన్నట్టుంది. కేవలం 86 పరుగులకే చాప చుట్టేసింది. తొలి ఓవర్ లోనే టాప్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ను బోల్తా కొట్టించాడు సిరాజ్ మియా. భారీ స్కోర్లతో బెంబేలెత్తించిన సన్ రైజర్స్ హైదరాబాద్ పేక మేడలా కూలి పోయింది . మిస్సైల్స్ లాగా బంతులు వేయడంతో ప్లేయర్లు విల విల లాడి పోయారు ఆడేందుకు. దీంతో ఐపీఎల్ టోర్నీలో పాయింట్ల పట్టికలో ఈ గ్రాండ్ విక్టరీతో టాప్ లోకి దూసుకు వెళ్లింది. ప్లే ఆఫ్స్ బెర్త్ ను ఖరారు చేసుకుంది గుజరాత్ టైటాన్స్. అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో చేతులెత్తేసింది ఎస్ఆర్ హెచ్. 82 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది.
పూర్తిగా ఈ పిచ్ బౌలర్లకు అనుకూలించింది. పేసర్లు ఈ అవకాశాన్ని వాడుకున్నారు. దీంతో బౌలర్లు కొట్టిన దెబ్బకు ఠారెత్తి పోయారు బ్యాటర్లు. ఆరెంజ్ ఆర్మీ చేష్టలుడిగి చూస్తూ ఉండి పోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్నీత 20 ఓవర్లలో 168 రన్స్ చేసింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 14.5 ఓవర్లలోనే 86 పరుగులకే కుప్ప కూలింది. ఆజట్టులో కెప్టెన్ కమిన్స్ ఒక్కడే 19 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా వాళ్లంతా అలా వచ్చి ఇలా పెవిలియన్ బాట పట్టారు. గుజరాత్ టైటాన్స్ లో సాయి సుదర్శన్ మరోసారి సత్తా చాటాడు. లేక పోతే ఆ స్కోర్ వచ్చి ఉండేది కాదు.