రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు గుజ‌రాత్ టైటాన్స్ బిగ్ షాక్

77 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైన ఆతిథ్య జ‌ట్టు

రాజ‌స్తాన్ : ఐపీఎల్ మెగా టోర్న‌మెంట్ లో శుభ్ మ‌న్ గిల్ సార‌థ్యంలోని గుజ‌రాత్ టైటాన్స్ భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది. రాజ‌స్తాన్ రాజ‌ధాని జైపూర్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో 77 ప‌రుగుల భారీ తేడాతో ఓడించింది. ఇక గుజ‌రాత్ ద‌ర్జాగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. పాయింట్ల ప‌ట్టిక‌లో ఈ విజ‌యంతో టాప్ లోకి దూసుకు వెళ్లింది. ఇవాళ చెన్నై సూప‌ర్ కింగ్స్ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తో త‌న ల‌క్ ను ప‌రీక్షించు కోనుంది. కెప్టెన్ రియాన్ ప‌రాగ్ లేక పోవ‌డంతో త‌న స్థానంలో య‌శ‌స్వి జైశ్వాల్ సార‌థ్యం వ‌హించాడు. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో గుజ‌రాత్ టైటాన్స్ స‌త్తా చాటింది. కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ కెప్టెన్సీ ఇన్సింగ్ తో ఆక‌ట్టుకున్నాడు. జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు.

త‌ను 44 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 84 ర‌న్స్ చేశాడు. ఇక బౌలింగ్ ప‌రంగా ఆఫ్గాన్ తురుపు ముక్క ర‌షీద్ ఖాన్ అద్భుత‌మైన బౌలింగ్ తో మ్యాజిక్ చేశాడు. త‌ను 33 ర‌న్స్ ఇచ్చి 4 కీల‌క వికెట్ల‌ను కూల్చాడు. ఈ టోర్నీలో అద్భుత‌మైన ఫామ్ తో ఉన్న సాయి సుద‌ర్శ‌న్ మ‌రోసారి స‌త్తా చాటాడు. కీల‌క‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. త‌ను విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. 36 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో 55 ర‌న్స్ చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 229 ర‌న్స్ చేసింది. అనంత‌రం 230 ప‌రుగుల భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ 16.3 ఓవ‌ర్ల‌లోనే 152 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. ఈ ఇన్నింగ్స్ లో ఇద్ద‌రే బాగా ఆడారు. జ‌డేజా 25 బంతులు ఆడి 3 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో 38 ర‌న్స్ చేస్తే వైభ‌వ్ సూర్య వంశీ 16 బంతులు ఆడి 3 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 36 ర‌న్స్ చేశారు. జేస‌న్ హొల్డ‌ర్ 12 ర‌న్స్ ఇచ్చి 3 వికెట్లు కూల్చాడు. ర‌షీద్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

Leave A Reply

Your Email Id will not be published!