గుజ‌రాత్ టైటాన్స్ జైత్ర‌యాత్ర చెన్నై కింగ్స్ ఇంటి బాట‌

89 ప‌రుగుల తేడాతో ఘోర ఓట‌మి..ప్లే ఆఫ్స్ ఆశ‌లు గ‌ల్లంతు

అహ్మ‌దాబాద్ : స్వంత గ‌డ్డ‌ప‌పై గుజ‌రాత్ టైటాన్స్ రెచ్చి పోయింది. అత్యంత బ‌ల‌మైన చెన్నై సూప‌ర్ కింగ్స్ ను మ‌ట్టి క‌రిపించింది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియ‌న్ అయిన సీఎస్కే ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగింది. గుజ‌రాత్ టైటాన్స్ అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో స‌త్తా చాటింది. టాప్ ఆర్డ‌ర్ ను కుప్ప కూల్చింది. ప్ర‌ధానంగా గుజ‌రాత్ బౌల‌ర్ల ధాటికి బ్యాట‌ర్లు విల విల లాడారు. పూర్తిగా పిచ్ పై విధ్వంసం సృష్టించారు శుభ్ మ‌న్ గిల్, సాయి సుద‌ర్శ‌న్, జోస్ బ‌ట్ల‌ర్. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 229 ర‌న్స్ చేసింది. 89 ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యం పాలైంది. దీంతో రెండో స్థానానికి చేరుకుంది గుజ‌రాత్ టైటాన్స్. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ముందుగా బ్యాటింగ్ కు దిగింది గుజ‌రాత్. సాయి సుద‌ర్శ‌న్ మ‌రోసారి స‌త్తా చాటాడు. 53 బంతుల్లో 7 ఫోర‌ర్లు 4 సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. 84 ర‌న్స్ చేశాడు.

ఇక త‌న‌కు తోడు గా కెప్టెన్ గిల్ 37 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 64 ర‌న్స్ చేశాడు. జోస్ బ‌ట్ల‌ర్ 27 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్స‌ర్ల‌తో 57 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కేవ‌లం 4 వికెట్లు కోల్పోయి భారీ స్కోరు సాధించింది. అనంత‌రం సిరాజ్ దెబ్బ‌కు చెన్నై ప్లేయ‌ర్లు వికెట్లు పారేసుకున్నారు. త‌ను వేసిన ఫ‌స్ట్ ఓవ‌ర్ తొలి బంతికే అవుట్ అయ్యాడు సంజు శాంస‌న్. ఆ త‌ర్వాత రుతురాజ్ గైక్వాడ్, ఉర్విల్ ప‌టేల్ పెవిలియ‌న్ బాట ప‌ట్టారు. సిరాజ్ 26 ప‌రుగులు ఇచ్చి 3 వికెట్లు తీస్తే ర‌షీద్ ఖాన్ 18 ర‌న్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. చెన్నై ప‌త‌నాన్ని శాసించాడు. సీఎస్కేలో శివం దూబే త‌ప్పా ఏ ఒక్క‌రూ ఆడ‌లేదు. త‌ను 17 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్స‌ర్ల‌తో 47 ర‌న్స్ చేవాడు.

Leave A Reply

Your Email Id will not be published!