అమరావతి : తెలుగుదేశం పార్టీకి చెంగిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్లా మాధవి నిప్పులు చెరిగారు. వైసీపీ బాస్ జగన్ రెడ్డి, ఆయన పరివారాన్ని ఏకి పారేశారు. మంగళవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి జరిగిందనేది వాస్తవమని, ఇది తమ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ నిగ్గు తేల్చిందని చెప్పారు. ఇందులో భాగంగానే ఆనాడు జగన్ రెడ్డి హయాంలో ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ తో పాటు అకౌంట్స్ ఆఫీసర్ బాలాజీపై కూడా వేటు వేయడం జరిగిందని చెప్పారు. కల్తీ నెయ్యి విషయంలో సిట్ నివేదిక ప్రకారం ఫ్లెక్సీలు వేశామన్నారు. ఫ్లెక్సీలు తొలగిస్తామని బెదిరించి, బూతులు తిట్టిందెవరు అని ప్రశ్నించారు గళ్లా మాధవి.
అగ్గి రాజేసిన తర్వాత ప్రెస్‍మీట్ పెట్టి మళ్లీ రెచ్చగొట్టింది ఎవరో వాళ్ల మనస్సాక్షికి తెలియదా అని నిలదీశారు ఎమ్మెల్యే. తాను అంబటి ఆఫీస్ వద్ద ఏం చేశాను.. ఎలా ఉన్నానో వీడియోల్లో ఉందని చెప్పారు. బూతులు తిట్టినప్పుడు కూడా మేం అడగక పోతే ఎలా అంటూ మండిపడ్డారు. దాడికి దిగాలంటే నేను రావాల్సిన పని లేదన్నారు గళ్లా మాధవి. మీరు టీడీపీ కార్యాలయం పైకి వేరేవాళ్లను పంపినట్లు చేసేవాళ్లం అన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా సీఎం చంద్రబాబును తిడతారా ఎలా అని భగ్గుమన్నారు ఎమ్మెల్యే. అంబటి కుమార్తెకు ఉన్న భయమే మా ఇంట్లో వారికి కూడా ఉంటుందన్నారు. ఆ విషయం తెలుసుకుంటే మంచిదన్నారు. తన ఇంటి వద్దకు వచ్చిన మహిళను ఎందుకు కొట్టారో మౌనిక చెప్పాలన్నారు. కేవలం తాము సారీ మాత్రమే అడిగామన్నారు.
