బ‌ల నిరూప‌ణ‌కు టీవీకే సిద్దం..గ‌వ‌ర్న‌ర్ నో ఛాన్స్

121 సీట్ల‌కు చేరిన విజ‌య్ టీవీకే పార్టీ బ‌లం

త‌మిళ‌నాడు : త‌మిళ‌నాట ఇంకా క‌న్ఫ్యూజ‌న్ కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 111 సీట్లు కావాల్సి ఉండ‌గా టీవీకే పార్టీకి 108 స‌భ్యుల బ‌లం ఉంది. అయితే సీపీఐ, సీపీఎంతో పాటు వీసీకే , ఐయుఎంఎల్ అభ్య‌ర్థులకు సంబంధించి ఆయా పార్టీల అధినేత‌లు తాము టీవీకే పార్టీకి బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో విజ‌య్ పార్టీ బ‌లం 121 సీట్ల‌కు చేరుకుంది. దీంతో టీవీకే కూట‌మి మెజారిటీ మార్కును అధిగ‌మించింది. తద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మార్గం సుగమమైంది. టీవీకే పార్టీ స్వయంగా 108 సీట్లను గెలుచుకుని, అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించింది.

ఈ సీట్లలో విజయ్ స్వయంగా గెలుచుకున్న రెండు నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. అయితే, పార్టీ వాస్తవ బలం 107 సీట్లుగా ఉంది. కూటమి భాగస్వామ్య పక్షాలు కూడా చెప్పుకోదగ్గ విజయాలను నమోదు చేశాయి. కాంగ్రెస్ ఐదు సీట్లు గెలుచుకోగా, భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ, సీపీఎం, విదుతలై చిరుతైగల్ కచ్చి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ చెరో రెండు సీట్ల చొప్పున గెలుచుకున్నాయి. ఈ కూటమి మొత్తం బలం మెజారిటీ మార్కును సులభంగా అధిగమించడంతో, రాష్ట్ర రాజకీయాల్లో విజయ్ ఎదుగుదల మరింత బలపడింది.

ఇదిలా ఉండ‌గా ఆయా పార్టీలు ప్ర‌క‌టించిన మ‌ద్ద‌తు లేఖ‌ల‌తో గ‌వ‌ర్న‌ర్ నివాసానికి బ‌య‌లుదేరి వెళ్లారు టీవీకే విజ‌య్, త‌న అనుచ‌రుల‌తో. విచిత్రం ఏమిటంటే గ‌వ‌ర్న‌ర్ రాజేంద్ర ఆయ‌న‌కు అపాయింట్మెంట్ ఇవ్వ‌లేదు. తాను కేర‌ళ‌కు వెళుతున్నాన‌ని, అందుబాటులో ఉండ‌డం లేదంటూ పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌య వ‌ర్గాలు పేర్కొన్నాయి. కాగా విజ‌య్ సీఎం కాకుండా కేంద్రంలోని బీజేపీ పావులు క‌దుపుతోంది. త‌న‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు త‌మిళ ఫ్యాన్స్.

Leave A Reply

Your Email Id will not be published!