Dinesh Khatik & Jitin Prasad : యోగి ఒంటెద్దు పోకడపై గరం
అమిత్ షా వద్దకు పంచాయతీ
Dinesh Khatik & Jitin Prasad : యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath) ఈ పేరు దేశంలో ఏ ఒక్కరిని అడిగినా చెబుతారు. పేరుకు తగ్గట్టే యోగి. సింప్లిసిటీని ఎక్కువగా ఇష్టపడే యోగి గురించి ఎంత చెప్పినా తక్కువే.
యూపీలో ఆయన ఏది చెబితే అది. అంతే కాదు రెండోసారి పవర్ లోకి తీసుకు వచ్చిన ఘనత కూడా ఆదిత్యానాథ్ దే. కానీ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీకి చెందిన వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
అవినీతి రహిత రాష్ట్రంగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు యోగి. ఆయన కంకణం కట్టుకున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. ప్రధానంగా ఆయనకు మరో పేరు కూడా ఈ మధ్య చేరింది.
అదే బుల్డోజర్ బాబా. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. అవినీతి పరుల ఆట కట్టిస్తూ నేరస్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. నేరాలు చేసిన వారంతా స్వతహాగా పోలీస్ స్టేషన్ ల వద్దకు వెళ్లి వేడుకుంటున్నారు.
ఎన్ కౌంటర్ చేయవద్దని. ఇదే సమయంలో యోగి అంటే పడని వారు కొందరు ఉన్నారు. తాజాగా ఆయన ఒంటెద్దు పోకడ తమకు ఇబ్బందిగా మారిందంటూ కొందరు మంత్రులు గుర్రుగా ఉన్నారు.
రాష్ట్రంలో జల శక్తి శాఖ సహాయ మంత్రిగా ఉన్న దినేష్ ఖటిక్(Dinesh Khatik) తప్పు కోవాలన్న యోచనలో ఉన్నట్లు టాక్. పీడబ్ల్యూడీ మంత్రి జితిన్ ప్రసాద్( Jitin Prasad) కూడా యోగి సర్కార్ పై తీవ్ర నిరాశతో ఉన్నారు.
ఓఎస్డీ అధికారి పాండే బదిలీపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అయితే అతడిపై అవినీతి ఆరోపణలు ఉన్నట్లు రావడంతో తప్పించారు సీఎం. మొత్తంగా మీద పంచాయతీ కేంద్ర మంత్రి అమిత్ షా వద్దకు చేరింది.
Also Read : లులు మాల్ లో ప్రార్థనలపై సీఎం కన్నెర్ర