Jharkhand Crisis : జార్ఖండ్ సంక్షోభం ఎమ్మెల్యేల త‌ర‌లింపు

కూల్చే ప‌నిలో భార‌తీయ జ‌న‌తా పార్టీ బిజీ

Jharkhand Crisis :  ఒక్క‌సారిగా సీన్ మారి పోయింది. కేంద్రంలో కొలువు తీరిన మోదీ, బీజేపీ స‌ర్కార్ తెలివిగా పావులు క‌దుపుతోంది. 2024లో దేశంలో జ‌ర‌గ‌బోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌న‌కంటూ ఎవ‌రూ ఎదురు రాకుండా ఉండేందుకు ఇప్ప‌టి నుంచే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ స్టార్ట్ చేసింది.

ఇందుకు గ‌వ‌ర్న‌ర్ల వ్య‌వ‌స్థ‌ను అద్భుతంగా వాడుకుంటోంది. భార‌త రాజ్యాంగంలో చోటు చేసుకున్న వెసులుబాట్లు కేంద్రానికి ఓ అందివ‌చ్చిన అవ‌కాశంగా మారాయి.

దీంతో బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాల‌ను కూల్చే ప‌నిలో ప‌డింది బీజేపీ. ఈ మేర‌కు స‌క్సెస్ కూడా అయ్యింది. ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర‌లో మ‌హా వికాస్ అఘాడీని ఏక్ నాథ్ షిండేను అడ్డం పెట్టుకుని కూల్చేసింది.

దానికి తామే బ‌హిరంగంగా మ‌ద్ద‌తు ఇచ్చింది. ప్ర‌స్తుతం మ‌రాఠా యోధుడు బాలా సాహెబ్ ఠాక్రే స్థాపించిన శివ‌సేన త‌న వార‌సుల‌కు ద‌క్క‌కుండా చేస్తోంది.

ఇది ప‌క్క‌న పెడితే ప్ర‌స్తుతం ప‌శ్చిమ బెంగాల్ , తెలంగాణ‌, జార్ఖండ్ , ఛ‌త్తీస్ గ‌ఢ్, ఏపీ రాష్ట్రాలు మాత్ర‌మే ఉన్నాయి. ఇందులో తెలంగాణ‌, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలు పూర్తిగా నిన్న‌టి దాకా ప్ర‌ధాన మంత్రి మోదీకి , ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ షాకు సాగిల‌ప‌డ్డాయి.

ఇది జ‌గ‌మెరిగిన స‌త్యం. బ‌య‌ట‌కు ఎంత మొత్తుకున్నా ఈరోజు వ‌ర‌కు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ప్ర‌యోగించ‌లేదు. ఇక తాజాగా జార్ఖండ్ వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు దారి తీసింది.

సీఎం హేమంత్ సోరేన్ త‌నంత‌కు(Jharkhand Crisis) తానుగా మైన్స్ లీజుకు తీసుకున్నారంటూ బీజేపీ ఆరోపించింది. గ‌వ‌ర్న‌ర్ దీనిని సాకుగా తీసుకున్నారు. ఈసీకి ఫిర్యాదు చేశారు.

ఆపై అన‌ర్హ‌త వేటు వేశారు. ప్ర‌స్తుతానికి సంకీర్ణ స‌ర్కార్ వ‌చ్చిన ముప్పేమీ లేక పోయినా బీజేపీ ఏమైనా చేయ‌గ‌ల‌దు. అందుకే సోరే త‌న ఎమ్మెల్యేల‌ను బ‌స్సుల్లో త‌ర‌లిస్తున్నారు. ఇది హాట్ టాపిక్ గా మారింది.

Also Read : గెల‌వ‌లేని వాళ్లు నీతులు చెబితే ఎలా

Leave A Reply

Your Email Id will not be published!