AIADMK vs BJP : అన్నాడీఎంకే బీజేపీ మ‌ధ్య దూరం

ఇరు పార్టీల మ‌ధ్య పెరిగిన వివాదం

AIADMK vs BJP : త‌మిళ‌నాడులో రాజ‌కీయాలు మారుతున్నాయి. అన్నాడీఎంకే భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌ధ్య దూరం పెరుగుతోంది. ఇరు పార్టీల మ‌ధ్య రోజు రోజుకు ఆరోప‌ణ‌ల ప‌ర్వం కొన‌సాగుతోంది. ఇద్ద‌రి మ‌ధ్య పొత్తు చివ‌రి ద‌శ‌లో ఉందా అన్న అనుమానం నెల‌కొంది. ఎడాపాడి ప‌ళ‌నిస్వామి త‌న మిత్ర‌ధ‌ర్మాన్ని ఉల్లంఘించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.

2019 లోక్ స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత అన్నాడీఎంకే మూడు ఎన్నిక‌ల్లో బీజేపీతో పోటీ చేసి ఓడి పోయింది. ఓ వైపు బీజేపీ త‌నంత‌కు తానుగా బ‌ల‌ప‌డాల‌ని ఆలోచిస్తోంది. ఆ పార్టీ చీఫ్ కె. అన్నామ‌లై దూకుడు పెంచారు. ఇక నిన్న‌టి దాకా అన్నాడీఎంకేకు ఎవ‌రు చీఫ్ అనే దానిపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డింది.

రాష్ట్రంలో కొలువు తీరిన డీఎంకే స‌ర్కార్ చాలా కూల్ గా ప్ర‌భుత్వాన్ని న‌డుపుతోంది. అన్నాడీఎంకే , బీజేపీల(AIADMK vs BJP) మ‌ధ్య సంబంధాలు గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ప‌డిపోయాయి. టుటికోరిన్ లో బీజేపీ కార్య‌క‌ర్త‌లు అన్నాడీఎంకే చీఫ్ ఇ. ప‌ళ‌నిస్వామి సంకీర్ణ ధ‌ర్మాన్ని పాటించ‌డం లేదంటూ ఆయ‌నకు సంబంధించిన ఫోటోల‌ను త‌గుల‌బెట్టారు. వారిలో బీజేపీ రాష్ట్ర ఐటీ విభాగం చీఫ్ సీఆర్టీ నిర్మ‌ల్ కుమార్ కూడా ఉండ‌డం విశేషం.

అన్నామ‌లై ఒక డీఎంకే మంత్రితో ర‌హ‌స్య అవ‌గాహ‌న క‌లిగి ఉన్నార‌ని ఆరోపిస్తూ అన్నాడీఎంకేలో చేరారు. గ‌త ఏడాది న‌వంబ‌ర్ లో ప‌ళ‌నిస్వామి రాష్ట్రానికి త‌న వ్య‌క్తిగ‌త ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను క‌ల‌వాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొన్నారు. ఇదే స‌మ‌యంలో బీజేపీ చీఫ్ అన్నామ‌లై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. బీజేపీ గాలి వీస్తోంద‌న్నారు. అన్నాడీఎంకేతో(AIADMK vs BJP) అవ‌స‌రం లేద‌ని అర్థం వ‌చ్చేలా మాట్లాడాడు.

Also Read : ఈడీ నోటీస్ క‌విత సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!