Upendra Kushwaha : మోడీని ఢీకొనే మ‌గాడు లేడు

మాజీ ఎంపీ ఉపేంద్ర కుష్వాహ‌

Upendra Kushwaha : జేడీయూ మాజీ ఎంపీ , బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు అనుచ‌రుడిగా పేరొందిన ఉపేంద్ర కుష్వాహ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. రాబోయే 2024లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ఢీకొనే మ‌గాడు లేడ‌న్నారు. శుక్ర‌వారం ఆయ‌న ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాను క‌లిశారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. బీహార్ సీఎంపై ఇప్ప‌టికే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాల‌ను క‌లిపేందుకు సీఎం చేస్తున్న ప్ర‌య‌త్నం విడ్డూరంగా ఉంద‌న్నారు.

ఢిల్లీ నుంచి వ‌చ్చాక ఆయ‌న ఎయిర్ పోర్ట్ లో మాట్లాడారు. దేశంలో బీజేపీకి తిరుగు లేద‌న్నారు. నితీశ్ చేస్తున్న‌దంతా బూడిద‌లో పోసిన పన్నీరేన‌ని ఎద్దేవా చేశారు. ఏ పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీని ఢీకొనే స్థితిలో లేద‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌లు మార్పును మాత్ర‌మే కోరుకుంటున్నార‌ని అందుకే వారంతా మోదీని పీఎంగా మ‌రోసారి కావాల‌ని కోరుకుంటున్నార‌ని తెలిపారు ఉపేంద్ర కుష్వాహ‌(Upendra Kushwaha).

ఎన్డీఏలో ప్ర‌వేశం అజెండాలో ఉందా అన్న ప్ర‌శ్న‌కు ఆయ‌న ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. జేడీయూతో విడి పోయి రాష్ట్రీయ లోక్ జ‌న‌తాద‌ళ్ ని స్థాపించారు. ఇందుకు సంబంధించి తాను ఏమి మాట్లాడ‌ననే దానిపై బ‌య‌ట పెట్టే ప‌రిస్థితిలో లేన‌ని చెప్పారు ఉపేంద్ర కుష్వాహ. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు వాటికి సంబంధించి త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాన‌ని తెలిపారు మాజీ ఎంపీ(Upendra Kushwaha).

Also Read : నేర‌మ‌యం రాజ‌కీయం

Leave A Reply

Your Email Id will not be published!