CJI Chandrachud : ఇంట‌ర్వ్యూలు ఇచ్చే వ్యాపారం లేదు – సీజేఐ

ధ‌నంజ‌య చంద్ర‌చూడ్ షాకింగ్ కామెంట్స్

భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ధ‌నంజ‌య చంద్ర‌చూడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. న్యాయ‌మూర్తులపై కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తికి పెండింగ్ లో ఉన్న కేసుల‌పై ఇంట‌ర్వ్యూలు ఇచ్చే వ్యాపారం లేద‌ని స్ప‌ష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆరోపించిన కుంభ‌కోణం లో సీబీఐ, ఈడీ కొన‌సాగుతున్న విచార‌ణ‌కు త‌మ ఉత్త‌ర్వు అడ్డంకి కాద‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది.

ఈ కేసుకు సంబంధించి జ‌స్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ ఒక న్యూస్ ఛానెల్ కి ఇంట‌ర్వ్యూ ఇచ్చారా లేదా అనే దానిపై నాలుగు రోజుల్లోగా కోల్ క‌తా హైకోర్టు రిజిస్ట్రార్ జ‌న‌ర‌ల్ ను నివేదిక ఇవ్వాల‌ని కోరింది . ప‌శ్చిమ బెంగాల్ లో పాఠ‌శాల ఉద్యోగం, లంచం కేసుకు సంబంధించింది ఇది. జ‌స్టిస్ గంగోపాధ్యాయ ఇచ్చిన ఇంట‌ర్యూపై సీరియ‌స్ గా స్పందించారు సీజేఐ. జ‌స్టిస్ పీఎస్ న‌ర‌సింహ‌తో ధ‌ర్మాస‌నం పంచుకున్న ప్ర‌ధాన న్యాయమూర్తి డీవై చంద్ర‌చూడ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

పిటిష‌న‌ర్ టీఎంసీ నాయ‌కుడు అభిషేక్ బెన‌ర్జీ ఏబీపీ ఆనంద అనే టీవీ ఛానెల్ లో జ‌స్టిస్ ఇంట‌ర్వూ అనువాదాన్ని జ‌త‌ప‌రిచారు. దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరారు. ఈ కేసును శుక్ర‌వారానికి జాబితా చేసింది సుప్రీంకోర్టు.
దీని వ‌ల్ల కొన‌సాగుతున్న విచార‌ణ నిలిచి పోయే అవ‌కాశం ఉంద‌ని కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల త‌ర‌పు ఏజీ ఎస్వీ రాజు కోర్టుకు విన్న‌వించారు. సింగిల్ జ‌డ్జి బెంచ్ ముందు ఉన్న పెండింగ్ కేసు గురించి న్యాయ‌మూర్తి ఇంట‌ర్వ్యూ ఇవ్వ కూడ‌ద‌ని ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!