భారతీయ జనతా పార్టీ నాయకుడు సుశీల్ మోదీ పరువు నష్టం కేసులో ఏఐసీసీ మాజీ చీఫ్ , మాజీ ఎంపీ రాహుల్ గాంధీపై విచారణను నిలిపి వేసింది కోర్టు. గుజరాత్ కోర్టు ఇలాంటి కేసులో ఇప్పటికే రాహుల్ ను దోషిగా నిర్దారించింది. కాగా అదే నేరానికి సంబంధించి మళ్లీ విచారణకు రాలేనంటూ రాహుల్ తరపు న్యాయవాది వాదించారు. దీంతో విచారణను నిలిపి వేస్తున్నట్లు బీహార్ లోని పాట్నా కోర్టు వెల్లడించింది.
కాగా రాహుల్ గాంధీపై బీజేపీ నేత సుశీల్ మోదీ పరువు నష్టం దావా వేశారు. మోదీ ఇంటి పేరు ఉన్న వారిపై కాంగ్రెస్ నాయకుడు , మాజీ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన దూషణలకు సంబంధించి నగరంలోని ట్రయల్ కోర్టులో జరుగుతున్న విచారణపై పాట్నా హైకోర్టు సోమవారం స్టే విధించిందింది.
ఇప్పటికే తనను దోషిగా నిర్దారించిందని, ఇదే నేరానికి మళ్లీ కేసు విచారణ చేపట్టడం ఎందుకని ప్రశ్నించారు. దీంతో రాహుల్ గాంధీ పిటిషన్ ను విచారిస్తున్న సమయంలో జస్టిస్ సందీప్ కుమార్ విచారణను ఉన్నట్టుండి నిలిపి వేశారు.
వచ్చే నెల మే 15 వరకు ట్రయల్ ప్రొసీడింగ్స్ ను హైకోర్టు నిలిపి వేసింది. ఆ తేదీ లోగా ఈ పిటిషన్ ను సమర్పించనున్నట్లు బీహార్ మాజీ డిప్యూటీ సీఎం , బీజేపీ సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ తరపు లాయన్ ఎస్ డీ సంజయ్ తెలిపారు.
