SP Singh Baghel : ముస్లింలలో మంచి వాళ్లు కొందరే
కేంద్ర మంత్రి బఘేల్ కామెంట్స్
SP Singh Baghel : కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి సత్య పాల్ సింగ్ బఘేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారిలో సహనంతో కూడిన వ్యక్తులు కొందరు మాత్రమే ఉన్నారని , వారిని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చని అన్నారు. వారి సంఖ్య వేలల్లో కూడా ఉండదని పేర్కొన్నారు. కొందరు మంచి వాళ్లుగా నటిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర మంత్రి.
అది కూడా ఉప రాష్ట్రపతి, గవర్నర్ లేదా వైస్ ఛాన్సలర్ ఇంటికి వెళ్లే మార్గంలో ముసుగు ధరించి ప్రజా జీవితంలో జీవించడం ఒక ఎత్తుగడగా అభివర్ణించారు సత్య పాల్ సింగ్ బఘేల్(SP Singh Baghel) . రాష్ట్రీయ స్వయం సేవక్ నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు.
సమాజంలోని మేధావులు అని పిలువబడే వారు అసలు ముఖం పదవీ కాలం పూర్తయ్యాక తెలుస్తుందన్నారు. వారు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారనేది అర్థం చేసుకోవాలని హెచ్చరించారు ఎస్పీ సింగ్ బఘేల్. జర్నలిస్టులకు అవార్డులను అందజేసేందుకు ఆర్ఎస్ఎస్ మీడియా విభాగంగ ఇంద్రప్రస్థ విశ్వ సంవాద్ కేంద్రం ఏర్పాటు చసిన దేవ్ రిషి నారద్ పాత్రకర్ సమ్మాన్ సమరోహ్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
Also Read : రిజర్వేషన్ రద్దుపై కోర్టు కామెంట్స్