ED Searches Lyca : పొన్నియన్ సెల్వన్ మేకర్స్ కు ఈడీ షాక్
పలు చోట్ల ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు
మనీ లాండరింగ్ కేసులో పొన్నియన్ సెల్వన్ మేకర్స్ పై సెంట్రల్ ఏజెన్సీ సోదాలు చేపట్టింది. ప్రొడక్షన్ హౌస్ పై కేంద్ర దర్యాప్తు సంస్థ మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని దాదాపు ఎనిమిది ప్రాంగణాల్లో సోదాలు జరుగుతున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ లైకా ప్రొడక్షన్స్ పొన్నియన్ సెల్వన్ 1, 2 లను నిర్మించింది.
లైకా ప్రొడక్షన్స్ ప్రాంగణంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియ రాలేదు. ఇదిలా ఉండగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ తీశారు. తమిళనాడులో చారిత్రిక నేపథ్యం కలిగి ఉన్న కథాంశం ఆధారంగా తెర కెక్కించాడు ఫిల్మ్ మేకర్. ఇందులో కార్తీ, విక్రమ్ , త్రిష, ఐశ్యర్వ రాయ్ , తదితరులు నటించారు. తొలి సీజన్ లో రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బాక్సాఫీసు బద్దలు కొట్టింది.
దీంతో పొన్నియన్ సెల్వన్ -2 పేరుతో సీక్వెల్ గా తెరకెక్కించాడు దర్శకుడు మణిరత్నం. ఈ చిత్రం గత నెల ఏప్రిల్ లో విడుదలైంది. భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ తరుణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ దాడులు చేపట్టడం కలకలం రేపుతోంది. ప్రధానంగా తమిళ సినీ రంగంలో ఇది హాట్ టాపిక్ గా మారింది.
