Rahul Gandhi Decide : రాహుల్ చెంత‌కు సీఎం ఎంపిక

సిద్ద‌రామ‌య్య వ‌ర్సెస్ డీకే శివ‌కుమార్

క‌ర్ణాట‌క సీఎం ఎంపిక వ్య‌వ‌హారం ఇంకా కొలిక్కి రాలేదు. మొత్తం 224 సీట్ల‌కు గాను కాంగ్రెస్ పార్టీకి 136 సీట్లు వ‌చ్చాయి. దీంతో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండానే, ఆధార ప‌డ‌కుండానే క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు ఊహించ‌ని తీర్పు ఇచ్చారు. అధికారంలో ఉన్న బొమ్మై నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఈ త‌రుణంలో పార్టీకి పూర్వ వైభ‌వాన్ని తీసుకు వ‌చ్చేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు క‌ర్నాట‌క ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివ‌కుమార్. మ‌రో వైపు సిద్ద‌రామ‌య్య సైతం ప్ర‌భావంత‌మైన నాయ‌కుడిగా ఉన్నారు. ఈ త‌రుణంలో ఇద్ద‌రి మ‌ధ్య కీల‌కమైన పోటీ నెల‌కొంది సీఎం పోస్టు కోసం.

ఇప్పటికే బెంగ‌ళూరు వేదిక‌గా సీఎల్పీ స‌మావేశం ముగిసింది. అంద‌రూ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి ఎవ‌ర‌నే దానిపై ఏఐసీసీ తుది నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలోని క‌మిటీ. ఈ మేర‌కు సీఎం ఎంపిక చివ‌ర‌కు దేశ రాజ‌ధాని ఢిల్లీకి చేరింది. సీఎం ఎంపిక వ్య‌వ‌హారం ఇంకా కొలిక్కి రాక పోవ‌డంతో ఉత్కంఠ నెల‌కొంది కాంగ్రెస్ లో.

ఇదిలా ఉండ‌గా మంగ‌ళ‌వారం అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించింది ఏఐసీసీ. ఈ స‌మావేశంలో ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఉన్నారు. ఇవాళ సాయంత్రానికి ఎలాగైనా స‌రే ఎవ‌రో ఒక‌రి పేరును ప్ర‌క‌టించాల‌ని డిసైడ్ అయ్యింది ఏఐసీసీ.

Leave A Reply

Your Email Id will not be published!