Mallu Bhatti Vikramarka : మార్పు ఖాయం అధికారం తథ్యం
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
Mallu Bhatti Vikramarka : రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) అన్నారు. ఆయన ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా పాదయాత్ర ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొనసాగుతోంది.
ఈ సందర్భంగా రాష్ట్రంలో కొలువు తీరిన భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు భట్టి విక్రమార్క. పాలన గాడి తప్పిందని, వ్యవస్థలన్నీ నిర్యీర్యమై పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల పేరుతో జనాన్ని బురిడీ కొట్టించిన సీఎం కేసీఆర్ కు తగిన రీతిలో బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజా సమస్యలను గాలికి వదిలి వేశారని , ఇంధ్ర భవనం లాంటి సచివాలయం ఎవరి కోసం నిర్మించారంటూ ప్రశ్నించారు. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారంటూ మండిపడ్డారు భట్టి విక్రమార్క. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఖాళీలు ఉంటే ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేసిన దాఖలాలు లేవన్నారు.
కేసీఆర్ తానంతకు తాను రాజునని భావిస్తున్నారని, అందుకే ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారంటూ ఎద్దేవా చేశారు మల్లు భట్టి విక్రమార్క. తెలంగాణను ఇచ్చిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నది మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. రైతు బంధు పేరుతో అన్నదాతలను దగా చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ధ్వజమెత్తారు సీఎల్పీ నేత.
Also Read : Sachin Pilot
