Navjyot Singh Sidhu : పంజాబ్ సర్కార్ పై సిద్దూ సీరియస్
రాష్ట్రంలో స్వేచ్ఛకు సంకెళ్లు
Navjyot Singh Sidhu : పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందన్నారు. గురువారం పార్టీకి సంబంధించిన ముఖ్య సమావేశం జరిగింది. ఈ సందర్బంగా సిద్దూ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది లేకుండా పోయిందన్నారు. అటు నేతలు, ప్రజలు, జర్నలిస్టులకు స్వేచ్ఛ అన్నది కరువైందని ఆవేదన చెందారు.
భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1) (ఎ)లో భావ వ్యక్తీకరణ, వాక్ స్వాతంత్రం అన్నది పొందు పర్చారని కానీ ఇవేవీ ఆప్ పాలనలో అమలు కావడం లేదన్నారు. ఆప్ ఎన్నో తీపికబుర్లు చెప్పిందని కానీ ఆచరణలో వాటిని పక్కన పెట్టిందని ధ్వజమెత్తారు నవ జ్యోత్ సింగ్ సిద్దూ(Navjyot Singh Sidhu).
రాష్ట్ర సర్కార్ పై విమర్శలు చేస్తే వెంటనే విజిలెన్స్ దిగి పోతోందని ఇదేనా ఆప్ ప్రజా పాలన అంటే అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం అయిన మీడియా తన స్వేచ్ఛను కోల్పోవడం దారుణమన్నారు. ఇంతకంటే అవమానం మరొకటి లేదని పేర్కొన్నారు. ప్రజల తరపున ప్రశ్నించే వాళ్లు, జనం గొంతుక వినిపించే మీడియాను ఎలా నియంత్రిస్తారంటూ నిప్పులు చెరిగారు సిద్దూ.
ఇదే సమయంలో కేంద్రం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ గురించి ఆప్ గగ్గోలు పెడుతోందని కానీ పంజాబ్ లో తాను కూడా నిరంకుశత్వంతో పాలన సాగిస్తుందన్న విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు.
Also Read : Rahul Journalist
