Rahul Gandhi : ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకున్న కోరమాండల్ రైలు ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకు భారీగా ప్రాణ నష్టం జరిగింది. 1,000 మందికి పైగా గాయాల పాలై ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ తో పాటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఆదేశాల మేరకు తనయుడు , మంత్రి ఉదయనిధి స్టాలిన్ , మరో మంత్రి , కాంగ్రెస్ పార్టీ తరపున లోక్ సభ నాయకుడు అరింధమ్ చౌదరి , రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘటనా స్థలాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురవుతున్నారు రైల్వై శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. జరిగిన నష్టానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దాసోజు శ్రవణ్ కుమార్.
ఇక ఆరు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలో ఉన్న ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఒడిశా రైలు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయనతో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Also Read : Rakesh Tikait Comment
