Air India : ఈ మధ్య భారత్ కు చెందిన ఇండియన్ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియాకు(Air India) కలిసి రావడం లేదు. కొన్ని ఇబ్బందులు ఏర్పడుతుండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ మరింతగా విమానాలు తీసుకు వస్తామని ప్రకటించినా చివరకు సర్వీస్ విషయంలో కొంత ఇబ్బందికి గురవుతున్నారు ప్రయాణీకులు.
తాజాగా ఢిల్లీ – శాన్ ఫ్రాన్సిస్కో ఫ్లైట్ లో ప్రభావితం అయిన వారందరికీ ఖుష్ కబర్ చెప్పింది ఎయిర్ ఇండియా. ఈ మేరకు పూర్తి మొత్తాన్ని తిరిగి ఇస్తామని ప్రకటించింది. తాము ఛార్జీల పరంగా పూర్తిగా రీఫండ్ ఇస్తామన్నారు. పూర్తి మొత్తం క్లియర్ చేస్తామని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి వాటికి సంబంధించి వోచర్లు కూడా ఇస్తామన్నారు ఎయిర్ ఇండియా ప్రతినిధి.
ఈ విమానాన్ని దారి మళ్లించారు. ఇందులో 216 మంది ప్రయాణీకులు ఉన్నారు. సాంకేతిక లోపం తలెత్తింది. అత్యవసర ల్యాండింగ్ కారణంగా మగడాన్ లో చిక్కుకు పోయింది. గురువారం మధ్యాహ్నం శాన్ ఫ్రాన్సిస్కోకు చేరుకుంది. విమానం సానుకూలంగా దిగేందుకు సహకరించిన ప్రభుత్వాలకు, ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలిపింది ఎయిర్ ఇండియా. మొత్తంగా ఎయిర్ ఇండియా చేసిన ఈ ప్రకటన ప్రయాణీకులకు సంతోషం కలిగించినా చివరకు తీవ్ర ఉత్కంఠకు లోనయ్యారు.
Also Read : S Jai Shankar Slams : కెనడాకు ఇది మంచిది కాదు – జై శంకర్