Om Raut Kiss Comment : ‘ముద్దు’ రాద్ధాంతం ‘ఓం’ ఛీత్కారం
ఛీ ఛీ ఇవేం పాడు పనులు రౌత్
Om Raut Kiss Comment : అది పవిత్రమైన పుణ్య స్థలం. కోట్లాది మంది ఆరాధించే దేవ దేవుడు కొలువై ఉన్న క్షేత్రం. తిరుమల కొండ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీఐపీల పేరుతో బ్రేక్ దర్శనాల తతంగం తీవ్ర వివాదాలకు దారి తీస్తోంది. ప్రత్యేకించి సినీ సెలిబ్రెటీలు వచ్చినప్పుడుల్లా దేవుడిని పక్కన పెట్టడం ఆపై వారికి సాదర స్వాగతం పలకడం పరిపాటిగా మారింది. నిత్యం వేలాది మంది కలియుగ శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు భక్తుల కానుకలు, విరాళాల రూపేణా భారీ ఆదాయం సమకూరుతోంది. లెక్కకు మించిన ఆస్తులు ఉన్నాయి.
పవిత్రంగా భావించి కొలిచే తిరుమల ఇప్పుడు లేకి చేష్టలకు కేరాఫ్ గా మారడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. సామాన్యులను పట్టించుకోని టీటీడీ సినీ రంగానికి చెందిన వారు వచ్చినప్పుడు మాత్రం ఎక్కడ లేని గౌరవ మర్యాదలు ఇస్తోందన్న విమర్శలు లేక పోలేదు. ఇది పక్కన పెడితే తాజాగా చోటు చేసుకున్న ఘటన దేశ వ్యాప్తంగా తల దించుకునేలా చేసింది. భక్తి అనేది వ్యక్తిగతం. సినిమా వేరు పుణ్య స్థలం వేరు. ఆలయం సాక్షిగా దర్శకుడు ఓం రౌత్(Om Raut) చేసిన పని సిగ్గు పడేలా చేసింది. తను తీసిన ఆది పురుష్ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలు తిరుపతిలో నిర్వహించారు. భారీ ఎత్తున నిర్వహించిన ఈ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి హాజరయ్యారు.
ఆపై మూవీ టీంను ఆశీర్వదించారు. సినిమా సక్సెస్ కావాలని కోరారు. ఆయనతో పాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. అనంతరం జూన్ 7న బుధవారం ఆదిపురుష్ టీం తిరుమలకు చేరుకుంది. పూజారులు ఆహ్వానం పలికారు. ఆపై శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో దర్శకుడు ఓం రౌత్(OM Raut), నటి కృతి సనన్ తో పాటు ఇతరులకు శాలువాలు కప్పారు. దర్శనం అనంతరం బయటకు వచ్చిన డైరెక్టర్ ఉన్నట్టుండి షాక్ ఇచ్చారు. అందరూ చూస్తూ ఉండగానే, సాక్షాత్తు ఆ దేవ దేవుడి ప్రాంగణంలో నటి కృతీ సనన్ దగ్గరకు వచ్చాడు. ఆమె సుతి మెత్తని చెంపల మీద గట్టిగా ముద్దు పెట్టాడు. ఆపై ఆలింగనం చేసుకున్నాడు. ఇదేమీ తెలియనట్టు నవ్వుతూ ఫోజులు ఇచ్చింది కృతీ సనన్.
విచిత్రం ఏమిటంటే ఓం రౌత్(OM Raut) తీసింది ఫక్తు భక్తికి సంబంధించిన సినిమా. నీతి, నిజాయితీ, ధర్మం, పాతివ్రత్యంకు సంబంధించిన విలువలతో కూడిన సినిమా ఆది పురుష్. ఇది ఇతిహాసం రామాయణంలోని శ్రీరాముడు, సీతకు సంబంధించిన కథ. దీనినే ఆధారంగా తీసిన ఈ దర్శకుడు అందుకు భిన్నంగా వ్యవహరించాడు. సభ్య సమాజం తల దించుకునేలా చేశాడు. ఏది ఏమైనా ప్రైవేట్ పరంగా ఏం చేసినా దానికి అభ్యంతరం లేదు. కానీ బహిరంగంగా ఇలాం బరితెగించడం మాత్రం ఏ సమాజమూ ఒప్పుకోదు. మరి నిత్యం హిందూ మతం, సంస్కృతికి తామే వారసులమని ప్రగల్భాలు పలుకుతున్న కాషాయ శ్రేణులు ఎందుకు నోరు మెదపడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
Also Read : Amit Shah : ఆరోగ్య సంరక్షణకు ఢోకా లేదు – షా