MLA Rekha Nayak : అధికారంలో భారత రాష్ట్ర సమితి పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ తాను పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. పార్టీ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేశారు.
MLA Rekha Nayak Joined in Congress
ఇందులో భాగంగా ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించ లేదు. ఇందులో ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ కూడా ఉన్నారు. చివరి వరకు తనకు సీటు వస్తుందని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో తన పేరు లేక పోవడంతో ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు.
అజ్మీరా రేఖా నాయక్ 2009 నుంచి 2014, 2018 నుంచి నేటి దాకా శాసనసభ సభ్యురాలిగా ఉన్నారు . డిసెంబర్ 19, 1974లో పుట్టారు. తండ్రి బీహెచ్ఈఎల్ లో జాబ్ , తల్లి రాష్ట్ర సర్కార్ లో ఎంప్లాయిగా ఉన్నారు. రేఖా నాయక్(MLA Rekha Nayak) ఎంఏ, ఎల్ఎల్బీ చదివింది.
ఇదిలా ఉండగా ఉన్నట్టుండి అజ్మీరా రేఖా నాయక్ తన నిర్ణయాన్ని మార్చు కోవడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీ గీత దాటితే వేటు తప్పదని వార్నింగ్ ఇచ్చారు. అయినా అజ్మీరా రేఖా నాయక్ గుడ్ బై చెప్పడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది.
Also Read : KTR Harish Rao : బావకు మద్దతు తెలిపిన బామ్మర్ది
