MLA Rohit Reddy : వికారాబాద్ జిల్లాలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మధ్య నిన్నటి దాకా పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేది.
MLA Rohit Reddy Met Patnam Mahinder Reddy
ఇద్దరూ అధికార పార్టీలో ఉన్నప్పటికీ నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థితికి ఆధిపత్య పోరు కొనసాగింది. టికెట్ ప్రకటించకంటే ముందు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాల మధ్య మాటల యుద్దం కొనసాగింది. చివరకు దాడులు చేసుకునేంత దాకా వెళ్లింది.
రాబోయే శాసన సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ చీఫ్ , తెలంగాణ సీఎం కేసీఆర్ 119 సీట్లకు గాను 115 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు. చివరి వరకు టికెట్ కోసం ప్రయత్నం చేసిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మొండి చేయి చూపారు కేసీఆర్.
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి(MLA Rohit Reddy), ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిలను కలిపే ప్రయత్నం చేశారు. దీంతో నిన్నటి దాకా ఎడ మొహం పెడ మొహంగా ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఒక్కటయ్యారు. తనకు టికెట్ దక్కడంతో పైలట్ రోహిత్ రెడ్డి స్వయంగా పట్నం మహేందర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన కాళ్లు మొక్కారు ఆశీర్వాదం తీసుకున్నారు. దీంతో ఇరు వర్గాల నాయకులు, శ్రేణులు విస్తు పోయారు.
Also Read : MLA Rekha Nayak : ఎమ్మెల్యే రేఖా నాయక్ గుడ్ బై
