Nara Lokesh : మంగళగిరిలో గెలుస్తా కానుకగా ఇస్తా
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
Nara Lokesh : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జగన్ లా కంచుకోట లాంటి నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయలేదన్నారు. కానీ 1985 నుండి టీడీపీ గెలవని మంగళగిరిలో పోటీ చేసి ఓడి పోయానని చెప్పారు.
Nara Lokesh Slams YS Jagan
కానీ ఆ అపజయమే తనలో కసి పెంచిందన్నారు. ఓటమితో రగిలి పోతున్నానని, ఈసారి ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు నారా లోకేష్(Nara Lokesh). అఖండ మెజారిటీతో గెలిచి తీరుతా.. పార్టీకి కానుకగా ఇస్తానని ప్రకటించారు .
రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చాడని , అప్పుల కుప్ప చేశాడంటూ జగన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు నారా లోకేష్. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని , ఆ విషయం 9 నెలల తర్వాత తేలి పోతుందన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని విర్ర వీగుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు తగిన రీతిలో తాము పవర్ లోకి వచ్చాక బుద్ది చెప్పి తీరుతామంటూ హెచ్చరించారు నారా లోకేష్.
ఓటమికి కుంగి పోయే జాతి కాదన్నారు. నిగ్గదీసి నిలదీసి కొట్లాడే పౌరుషం కలిగిన కుటుంబం తనదన్నారు. చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. లేక పోతే బాగుండదన్నారు.
Also Read : ISRO Chairman : ఇస్రో చైర్మన్..టీం సంబురం
