TTD Board Member : లిక్కర్ స్కామ్ అప్రూవర్ టీటీడీ మెంబర్
శరత్ చంద్రా రెడ్డికి ఏపీ సీఎం నజరానా
TTD Board Member : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో అప్రూవర్ గా మారిన ఏపీకి చెందిన శరత్ చంద్రా రెడ్డికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఖుష్ కబర్ చెప్పారు. ఆయనకు కోట్లాది మంది నిత్యం కొలిచే శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా నియమించారు.
TTD Board Member Newly Appionted
ఇప్పటికే టీటీడీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని బీజేపీ, హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. కీలకమైన కేసులో అప్రూవర్ గా మారిన వ్యక్తిని టీటీడీ(TTD) బోర్డు సభ్యునిగా ఎలా నియమిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.
వ్యాపారవేత్తగా పేరు పొందిన శరత్ చంద్రా రెడ్డి తెలంగాణ సీఎం కూతురు ఎమ్మెల్సీ కవితతో కలిసి సౌత్ గ్రూప్ గా ఏర్పడ్డారని కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు ఆరోపించాయి. ఆప్ నేతలకు రూ. 100 కోట్ల మేర ఇచ్చారంటూ పేర్కొన్నాయి.
ఈ కేసుకు సంబంధించి శరత్ చంద్రా రెడ్డిని అరెస్ట్ చేయడం, ఆయన జైలుకు వెళ్లడం ఆ తర్వాత అప్రూవర్ గా మారడం తిరిగి బెయిల్ పొందడం చకచకా జరిగాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో రెడ్డి కీలకమైన నిందితుడిగా ఉన్నారు. అరబిందో ఫార్మా కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు.
ఇదే కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కూడా సీబీఐ, ఈడీ ప్రశ్నించాయి. కానీ నిందితురాలిగా పేర్కొనలేదు.
Also Read : TTD Chairman : వరలక్ష్మీ వ్రతం లోకం సుభిక్షం
