Rahul Priyanka : గ‌ద్ద‌ర్ ఫ్యామిలీకి రాహుల్..ప్రియాంక భ‌రోసా

పార్టీ ప‌రంగా ఆదుకుంటామ‌ని హామీ

Rahul Priyanka : హైద‌రాబాద్ – ప్ర‌జా యుద్ద నౌక గ‌ద్ద‌ర్ ఇటీవ‌లే క‌న్ను మూశారు. ఆయ‌న కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు ఏఐసీసీ మాజీ చీఫ్, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ. నిన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో విజ‌య భేరి స‌భ‌ను నిర్వ‌హించింది. ఇందులో పాల్గొన్నారు అన్నా చెల్లెలు.

Rahul Priyanka Met Gaddar Family

ఈ సంద‌ర్భంగా గ‌ద్ద‌ర్ నివ‌సిస్తున్న నివాసానికి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేరుకున్నారు. గ‌ద్ద‌ర్ భార్య విమ‌ల‌, కొడుకు సూర్య‌, కోడ‌లును ప‌రామ‌ర్శించారు. వారికి భ‌రోసా ఇచ్చారు. పార్టీ ప‌రంగా తాము ఉన్నామ‌ని హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండ‌గా గ‌ద్ద‌ర్ అస‌లు పేరు గుమ్మ‌డి విఠ‌ల్ రావు. కోట్లాది మంది ప్ర‌జ‌ల‌ను త‌న ఆట‌, పాట‌ల‌తో ప్ర‌భావితం చేశాడు. ఆయ‌న‌కు ప్రజా యుద్ద నౌక అనే పేరు వ‌చ్చింది. వేలాది మంది జ‌నం గ‌ద్ద‌ర్ అంతిమ‌యాత్ర‌లో పాల్గొన్నారు. త‌మ క‌న్నీటి నివాళులు అర్పించారు.

చ‌ని పోయేంత వ‌ర‌కు త‌న శ‌రీరంలో తూటాను పెట్టుకుని బ‌తికారు. ఇలా ప్ర‌పంచంలో తూటాను క‌లిగిన ఏకైక ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ మాత్ర‌మే కావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌పంచ వ్యాప్తంగా గ‌ద్ద‌ర్ కు లెక్క‌లేనంత మంది అభిమానులు ఉన్నారు. గ‌ద్ద‌ర్ పాట‌గాడు మాత్ర‌మే కాదు ర‌చ‌యిత‌, వ‌క్త కూడా. పాల్ రాబ్స‌న్ లాంటి వాడు గ‌ద్ద‌ర్ అని పేర్కొన్నాడు శ్రీ‌శ్రీ‌.

Also Read : Nara Brahmani : అరెస్ట్ అక్ర‌మం కుట్ర నిజం

Leave A Reply

Your Email Id will not be published!