Bengaluru Bandh : బెంగళూరు – కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య నీటి వివాదం మళ్లీ రాజుకుంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేసింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. నీటిని ఎలా విడుదల చేస్తారంటూ మండిపడ్డారు రైతులు. అంతే కాకుండా ఏకంగా 300కు పైగా సంస్థలు మంగళవారం బెంగళూరుకు బంద్ కు పిలుపునిచ్చాయి.
Bengaluru Bandh Viral
ఇదిలా ఉండగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య(Siddaramaiah), తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ లకు అంతిమ సంస్కారాలు చేస్తూ నిరసన తెలిపారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన రైతులు. దీంతో బెంగళూరు నగరం నిర్మానుశ్యంగా మారింది. భారీ గా పోలీసులు మోహరించారు. దీంతో ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.
నిన్నటి అర్ధరాత్రి నుంచి నేటి అర్ధరాత్రి దాకా 144 సెక్షన్ విధిస్తున్నట్లు రాష్ట్ర పోలీస్ ప్రకటించింది. నగరంలో ఎలాంటి ఊరేగింపులకు, నిరసనలకు అనుమతి లేదని డీజీపీ ప్రకటించారు. అయినా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్లపైకి వచ్చారు.
తమకు పొరుగు రాష్ట్రాలతో పేచీ ఏమీ లేదని కానీ తమ పొట్ట కొడుతూ ఇతరులకు నీళ్లు ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇందు కోసమేనా మీకు ఓట్లు వేసి గెలిపించిందంటూ ప్రశ్నించారు.
Also Read : Nara Lokesh Slams : అరెస్ట్ చేసినా యువగళం ఆగదు
