Minister KTR : రూ.16,650 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ ల్యాబ్
ఆనందంగా ఉందన్న మంత్రి కేటీఆర్
Minister KTR : హైదరాబాద్ – తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు మరింత లాభదాయకంగా మార్చేలా చేశాయి. ప్రత్యేకించి పెట్టుబడిదారులు, కంపెనీలు, సంస్థలకు, బడా బాబులకు మేలు చేకూర్చేలా చర్యలు చేపట్టారు. ప్రత్యేకించి వారికి అనుకూలంగా ఉండేలా సహకారం అందించడంతో పెద్ద ఎత్తున కంపెనీలు క్యూ కడుతున్నారు.
Minister KTR Words
ఈ తరుణంలో తాజాగా మరో దిగ్గజ కంపెనీ భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేయనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పంచుకున్నారు. ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రముఖ గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ గ్రీన్ ఫీల్డ్ భారీ ఎత్తున పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ పట్వారీ, ఆపరేటింగ్ పార్ట్ నర్ వైధీష్ అన్న స్వామి మర్యాద పూర్వకంగా మంత్రి కేటీఆర్ ను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏకంగా రూ. 16,650 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ ఆర్ అండ్ డి ల్యాబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీనిపై సంతోషం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. ఇది తమ పనితీరుకు అద్దం పడుతుందన్నారు. ఈ ల్యాబ్ ఏర్పాటు వల్ల భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. ఎండీకి, పార్ట్ నర్ కు ధన్యవాదాలు తెలిపారు మంత్రి.
Also Read : Minister KTR : కిటెక్స్ చీఫ్ జాకబ్ కు థ్యాంక్స్ – కేటీఆర్