Nara Lokesh : టీడీపీ మోత జ‌గ‌న్ కు వాత

పార్టీ అగ్ర నేత నారా లోకేష్

Nara Lokesh : న్యూఢిల్లీ – టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌మ పార్టీ ఇచ్చిన పిలుపు మేర‌కు మోత మోగిద్దాం కార్య‌క్ర‌మం ఊహించ‌ని దానికంటే ఎక్కువ‌గా స‌క్సెస్ అయ్యింద‌ని పేర్కొన్నారు.

ఆదివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు నారా లోకేష్. ఈ ప్రోగ్రామ్ ను విజ‌య‌వంతం చేసినందుకు ప్ర‌తి ఒక్క‌రికీ పేరు పేరునా తాను ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్నాన‌ని స్ప‌ష్టం చేశారు.

Nara Lokesh Slams YS Jagan

తెలుగుదేశం పార్టీకి చెందిన నేత‌లు, శ్రేణులు కింది స్థాయి నుంచి పైస్థాయి దాకా రాజ‌మండ్రి జైలులో అన్యాయంగా రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభ‌విస్తున్న త‌న తండ్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు సంఘీభావం తెల‌ప‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

ప్ర‌జ‌లు అంతా గ‌మ‌నిస్తున్నార‌ని, సైకో జ‌గ‌న్ రెడ్డికి రాబోయే కాలంలో ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. సంక్షేమ ప‌థ‌కాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చిన ఘ‌న‌త జ‌గ‌న్ రెడ్డికే ద‌క్కింద‌న్నారు.

ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశార‌ని, చివ‌ర‌కు త‌న‌కు కూడా నోటీసు ఇవ్వ‌డం దారుణ‌మ‌న్నారు నారా లోకేష్(Nara Lokesh). మొత్తంగా జ‌గ‌న్ స‌ర్కార్ కు మూడింద‌న్నారు. తాము ప‌వ‌ర్ లోకి వ‌స్తామ‌న్నారు .

ఇదే స‌మ‌యంలో త‌న అరెస్ట్ ను నిర‌సిస్తూ త‌న తండ్రి నారా చంద్ర‌బాబు నాయుడు అక్టోబ‌ర్ 2 సోమ‌వారం గాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని నిరాహార‌దీక్ష జైలులో చేప‌డ‌తార‌ని చెప్పారు. అంతే కాకుండా త‌న త‌ల్లి నారా భువ‌నేశ్వ‌రి కూడా దీక్షకు కూర్చుంటార‌ని తెలిపారు.

Also Read : Mallu Bhatti Vikramarka : కేసీఆర్ పై భ‌ట్టి గ‌రం గ‌రం

Leave A Reply

Your Email Id will not be published!