Minister KTR : మోదీ హామీల అమ‌లు జాడేది – కేటీఆర్

తెలంగాణ‌పై క‌క్ష సాధింపు దేనికి

Minister KTR : హైద‌రాబాద్ – ఐటీ, ప‌రిశ్ర‌ల శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. కేవ‌లం పైపై మాట‌లు చెప్ప‌డం త‌ప్పితే తెలంగాణ రాష్ట్రానికి, ప్ర‌జ‌ల‌కు చేసింది ఏమీ లేద‌న్నారు. ఎన్ని నిధులు ఇచ్చారో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని కోరారు.

Minister KTR Slams PM Modi

ఆదివారం మంత్రి కేటీఆర్(Minister KTR) ట్విట్టర్ వేదిక‌గా స్పందించారు. ఏం ముఖం పెట్టుకుని ఇవాళ పాల‌మూరుకు వ‌చ్చారంటూ ప్ర‌శ్నించారు. ఇవాళ అన్ని రంగాల‌లో తెలంగాణ ముందంజ‌లో ఉంద‌న్నారు. దీనికి ప్ర‌ధాన కార‌కుడు మా దార్శ‌నిక నాయ‌కుడు కేసీఆర్ వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌ని పేర్కొన్నారు.

మోదీ కొలువు తీరాక దేశంలో ఏం సాధించారో ఒక్క‌ట‌న్నా చెప్ప‌గ‌ల‌రా అంటూ ప్ర‌శ్నించారు. ఎంత సేపు కులం, మ‌తం , ప్రాంతం పేరుతో రాజ‌కీయాలు చేయ‌డం త‌ప్పితే దేశానికి ప‌నికి వ‌చ్చే ఒక్కట‌న్నా చేశారా అంటూ ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్.

ఐటీ, ఫార్మా, లాజిస్టిక్, నీటి పారుద‌ల రంగాల‌లో తెలంగాణ టాప్ లో కొన‌సాగుతోంద‌న్నారు. త‌మ‌తో ఏ రాష్ట్రం పోటీ ప‌డే ప‌రిస్థితి లేద‌న్నారు. ఇవాళ పంజాబ్ ను దాటేసి త‌మ రాష్ట్రం ధాన్యాగారంగా మారింద‌న్నారు. ఇక‌నైనా రాజ‌కీయాలు మానేసి ఇచ్చిన హామీలు అమ‌లు చేయాల‌ని సూచించారు కేటీఆర్ మోదీకి.

Also Read : Nara Lokesh : టీడీపీ మోత జ‌గ‌న్ కు వాత

Leave A Reply

Your Email Id will not be published!