N Tulasi Reddy : ఆ ముగ్గురికి ఓటేస్తే బీజేపీకి వేసిన‌ట్లే

ఏపీసీసీ మాజీ చీఫ్ తుల‌సీ రెడ్డి ఫైర్

N Tulasi Reddy : అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ మాజీ చీఫ్ తుల‌సీరెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. కేంద్రంలో ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను అమ్ముతున్న ఘ‌న‌త మోదీకి ద‌క్కుతుంద‌న్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ మ‌ణిపూర్ ను ఎలా చేసిందో దేశం మొత్తం చూసింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు తుల‌సీ రెడ్డి.

N Tulasi Reddy Serious Comments

ఏపీలో పాల‌న ప‌డ‌కేసింద‌న్నారు. రాష్ట్రంలో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆవేద‌న చెందారు. రాష్ట్రంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ప‌వ‌న్ క‌ళ్యాణ్, చంద్ర‌బాబు నాయుడుల‌లో ఎవ‌రికి ఓటు వేసినా ఆ ఓట్ల‌న్నీ ప్ర‌ధాన మంత్రి మోదీకి, బీజేపీకి ఓటు వేసిన‌ట్లేన‌నంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఇక‌నైనా ప్ర‌జ‌లు మారాల‌ని లేక పోతే భ‌విష్య‌త్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. ఇక‌నైనా మారాల‌ని హిత‌వు ప‌లికారు. రైల్వే జోన్ ఇప్ప‌టి వ‌ర‌కు రాలేద‌న్నారు. పోల‌వ‌రం పూర్తి కాలేద‌న్నారు తుల‌సీ రెడ్డి(N Tulasi Reddy). రాష్ట్రానికి తీర‌ని ద్రోహం త‌ల‌పెడుతున్నా ఒక్క‌రు కూడా ప్ర‌శ్నించ‌క పోవ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు.

మోదీ చేతిలో ఈ ప్రాంతీయ పార్టీల నేత‌లంతా బందీ అయి పోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కీలుబొమ్మ పార్టీల‌తో రాష్ట్రానికి ఎలాంటి మేలు జ‌రుగుతుంద‌ని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ , ప‌వ‌న్ , చంద్ర‌బాబు ముగ్గురూ కేవ‌లం అధికారం యావ‌తో ప‌ని చేస్తున్నార‌ని ఆరోపించారు.

Also Read : Sailajanath : జ‌గ‌న్ పాల‌నలో రైతుల ఇక్క‌ట్లు

Leave A Reply

Your Email Id will not be published!