Revanth Reddy : రాజ‌కీయ క‌క్ష సాధింపులు ఉండ‌వు

స్ప‌ష్టం చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Revanth Reddy : హైద‌రాబాద్ – టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాము అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ మేర‌కు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాము ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక రాజ‌కీయ ప‌రంగా ఎలాంటి క‌క్ష సాధింపు చ‌ర్య‌లు అంటూ ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేశారు.

Revanth Reddy Comment

త‌న‌పై గ‌తంలో కాల్పులు జ‌రిగిన‌ప్ప‌టికీ తాను ఎదురు దాడుల‌కు దిగ లేద‌ని చెప్పారు. ప్ర‌తీకార చ‌ర్య‌ల‌కు దిగ‌డం, అక్ర‌మంగా అరెస్ట్ లు చేయ‌డం త‌మ పార్టీ విధానం కాద‌ని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ బోర్డును ర‌ద్దు చేస్తామ‌ని చెప్పారు. వాటి స్థానంలో యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ త‌ర‌హాలో బోర్డును ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు టీపీసీసీ చీఫ్‌.

ఇప్ప‌టికే మేనిఫెస్టోలో తాము భ‌ర్తీ చేయ‌బయే పోస్టుల గురించి వివ‌రాలు ఇవ్వ‌డం జరిగింద‌న్నారు. అంతే కాకుండా జాబ్ క్యాలెండ‌ర్ కూడా డిక్లేర్ చేశామ‌న్నారు. ఇందులో ఎలాంటి ప్ర‌భుత్వ జోక్యం అనేది ఉండ‌ద‌న్నారు రేవంత్ రెడ్డి. త‌మ పాల‌న పూర్తిగా పార‌ద‌ర్శ‌కంగా ఉంటుంద‌న్నారు టీపీసీసీ చీఫ్‌.

అయితే అవీనితి, అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వారిని వ‌దిలి పెట్టే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు . క‌ల్వ‌కుంట్ల కుటుంబం ఇక జైలుకు వెళ్ల‌డం త‌ప్ప‌ద‌న్నారు.

Also Read : kodali Nani : పురంధేశ్వ‌రిపై కొడాలి నాని ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!