Rahul Gandhi : న్యూఢిల్లీ – దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ జయంతి ఇవాళ. ఈ సందర్భంగా ఆమె దేశం కోసం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు మనుమడైన ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ. ఆదివారం ట్విట్టర్ వేదికగా అరుదైన ఫోటోను పంచుకున్నారు. నీతో గడిపిన ప్రతి క్షణం మరిచి పోలేనని పేర్కొన్నారు.
Rahul Gandhi Comment
ఈ దేశం గర్వించ దగిన నాయకురాళ్లలో ఇందిరా గాంధీ ముందంజలో ఉంటారని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). తన జీవిత కాలమంతా దేశం కోసం, అభ్యున్నతి కోసం, ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారని కొనియాడారు. నాయినమ్మ నేర్పిన విలువలు ఎల్లప్పటికీ తనను ప్రభావితం చేస్తూనే ఉంటాయని అన్నారు.
నాయినమ్మ తనకు తొలి గురువు అని వెల్లడించారు. ఆమె లేని జీవితం ఊహించ లేనిదని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. ఎంతో గొప్ప స్థానంలో ఉన్నప్పటికీ ఏనాడూ గర్వానికి గురి కాలేదన్నారు. ఎల్లప్పుడూ ప్రజల కోసం ఏం చేయాలనేది ఆలోచిస్తూ ఉండేదని కొనియాడారు తన నాయినమ్మ గురించి అని స్పష్టం చేశారు.
Also Read : Priyanka Gandhi : ఇందిర జీవితం స్పూర్తి దాయకం
