Amit Shah : దీదీ పాల‌న‌లో ఆగ‌మాగం

నిప్పులు చెరిగిన అమిత్ షా

Amit Shah : కోల్ క‌తా – ప‌శ్చిమ బెంగాల్ లో మ‌మ‌తా బెన‌ర్జీ సార‌థ్యంలోని ప్ర‌భుత్వం ఇచ్చిన మాట నిల‌బెట్టు కోలేద‌ని ఆరోపించారు కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా. బుధ‌వారం జ‌రిగిన సమావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. సోనార్ బంగ్లా, మామ‌తి మానుష్ నినాదాల‌తో క‌మ్యూనిస్టుల ఆధిప‌త్యానికి చెక్ పెట్టింద‌ని , దీని ద్వారా అధికారంలోకి వ‌చ్చినా ప్ర‌జ‌ల‌కు , రాష్ట్రానికి చేసింది ఏమీ లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

Amit Shah Slams Mamata Banerjee

ఇన్నేళ్లుగా పాలిస్తున్నా ఏమైనా అభివృద్ది జ‌రిగిందా అని ప్ర‌శ్నించారు అమిత్ చంద్ర షా(Amit Shah). నేటికీ బెంగాల్ అట్టుడుకుతోంద‌ని, అల్ల‌ర్ల‌తో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక ఎంత మాత్రం దీదీ సీఎంగా కొన‌సాగేందుకు వీలు లేద‌న్నారు. ఇవాళ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఇక్క‌ట్ల‌పాలు కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆమేన‌ని మండిప‌డ్డారు కేంద్ర మంత్రి.

అన్ని రంగాలు నిర్వీర్యం చేశార‌ని, కేవ‌లం హింస మాత్ర‌మే రాజ్యం ఏలుతోంద‌న్నారు. చొర‌బాట్లు పెరిగాయ‌ని, బుజ్జ‌గింపులు, రాజ‌కీయ హింస పేట్రేగి పోయింద‌ని మండిప‌డ్డారు. 2026లో ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలంటే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో పునాది వేయాల‌ని పిలుపునిచ్చారు. న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీని దేశానికి ప్రధానమంత్రిని చేయాల‌ని కోరారు అమిత్ షా.

Also Read : Padi Kaushik Reddy : అల‌సి పోయాను ఆదుకోండి

Leave A Reply

Your Email Id will not be published!