Revanth Reddy Meeting : హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం
Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణలో కొత్త సర్కార్ అధికారంలోకి వచ్చంది. దీంతో సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎన్నికయ్యారు. ఆయనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందుకు డిసెంబర్ 7 గురువారం ముహూర్తం ఖరారు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ గుప్తా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అతిరథ మహారథులు హాజరు కానుండడంతో భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Revanth Reddy Meeting Today
ఇదిలా ఉండగా జనం తరలి రానుండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ ను దారి మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఏఆర్ పెట్రోల్ పంపు నుండి పబ్లిక్ గార్డెన్స్ వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. ఎస్బీఐ గన్ ఫౌండ్రీ నుంచి వచ్చే ట్రాఫిక్ బీజేఆర్ సర్కిల్ వైపు ఛాన్స్ లేదు. చాపెల్ రోడ్ వైపు దారి మళ్లిస్తారు. బషీర్ బాగ్ నుండి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే ట్రాఫిక్ కు పర్మిషన్ ఉండదు. కింగ్ కోఠి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ రోడ్డు వైపు మళ్లిస్తారు. సుజాత స్కూల్ లేన్ నుండి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను అనుమతించరు . సుజాత స్కూల్ జంక్షన్ వద్ద నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు మళ్లిస్తారు .
Also Read : India Alliance : ఫలితాలపై ఇండియా పోస్టుమార్టం