KA Paul : మోదీపై పోటీ చేస్తా – పాల్

ఎక్క‌డి నుంచైనా ఓకే

KA Paul : హైద‌రాబాద్ – ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్ డాక్ట‌ర్ కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఆయ‌న ప్ర‌ధానంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకున్నారు. రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా పీఎం తెలంగాణ‌లో పోటీ చేస్తార‌ని ఎక్కువ‌గా ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని చెప్పారు. బీజేపీ శ్రేణులు ప‌దే ప‌దే న‌రేంద్ర మోదీ సికింద్రాబాద్ లేదా మ‌ల్కాజిగిరి నియోజ‌క‌వ‌ర్గాల నుంచి బ‌రిలో ఉంటార‌ని చెబుతున్నార‌ని అన్నారు.

KA Paul Comments Viral

ఇదిలా ఉండ‌గా మోదీ ఎక్క‌డ నుంచి పోటీ చేసినా తాను ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. న‌రేంద్ర మోదీపై త‌ప్ప‌కుండా పోటీ చేసి తీరుతాన‌ని ప్ర‌క‌టించారు డాక్ట‌ర్ కే ఏ పాల్(KA Paul) . తెలుగు వాడి స‌త్తా ఏమిటో తాను చూపించేందుకు సిద్దంగా ఉన్నానంటూ తెలిపారు.

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌కు తానే హామీ అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న లాంటి వాడికి పార్ల‌మెంట్ కు వెళ్లేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు . తాను ఒక్క‌డిని తప్పా కేంద్ర‌, రాష్‌ట్ర ప్ర‌భుత్వాలు చేసిన అప్పుల‌ను తీర్చ లేర‌న్నారు. వ‌డ్డీలు కూడా క‌ట్టిన పాపాన పోలేద‌న్నారు ప్ర‌జా శాంతి పార్టీచీఫ్.

జాతీయ వాదం, మ‌తం పేరుతో దేశాన్ని స‌ర్వ‌నాశనం చేశార‌ని ఆరోపించారు డాక్ట‌ర్ కేఏ పాల్. మోదీ మాయ మాట‌ల‌తో బురిడీ కొట్టించ‌డంలో దిట్ట అంటూ మండిప‌డ్డారు కేఏ పాల్.

Also Read : Harish Rao : శ్వేత ప‌త్రంపై త‌న్నీరు క‌న్నెర్ర‌

Leave A Reply

Your Email Id will not be published!