Government of India: ఆ మీడియా సంస్థల ‘ఎక్స్’ ఖాతాల నిలిపివేతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
ఆ మీడియా సంస్థల ‘ఎక్స్’ ఖాతాల నిలిపివేతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
Government of India : చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ న్యూస్, తుర్కియేకు చెందిన మీడియా సంస్థ టీఆర్‌టీ వరల్డ్ కు చెందిన ‘ఎక్స్’ హ్యాండిల్స్ భారత్ లో నిలిచిపోవడంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వాటిని నిలిపివేయాల్సిన అవసరం భారత (Government of India) ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. అసలు ‘ఎక్స్’ వాటిని ఎందుకు నిలిపివేయాల్సి వచ్చిందో కారణాలు తెలుసుకుంటున్నామని, సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించారు.
Government of India Ban
గ్లోబల్ టైమ్స్ న్యూస్, టీఆర్‌టీ వరల్డ్ సంస్థలకు చెందిన ‘ఎక్స్’ హ్యాండిల్స్ భారత్‌లో ఆదివారం తాత్కాలికంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. న్యాయ సంబంధిత కారణాల వల్లే వాటిని నిలిపివేసినట్లు ‘ఎక్స్’లో సందేశం కనిపించింది. దీనిపై ఆ సంస్థ యాజమాన్యంతో భారత అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. అక్కడికి కొన్ని గంటల ముందే బ్రిటన్ కేంద్రంగా పని చేస్తున్న న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ‘ఎక్స్’ హ్యాండిల్ కూడా భారత్‌లో నిలిచిపోయింది. దీనిపైనా ప్రశ్నలు ఉత్పన్నమవడంతో ఆ హ్యాండిల్ ను బ్లాక్ చేయాల్సిన అవసరం భారత్ కు లేదని, సమస్యను పరిష్కరించేందుకు నిరంతరాయంగా కృషి చేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.
సాంకేతిక తప్పిదాల వల్లే ఇలా కొన్ని ఎక్స్ హ్యాండిల్స్ బ్లాక్ అవుతున్నట్లు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ‘‘ రాయిటర్స్ ఎక్స్ ఖాతాను నిలిపివేయాలని భారత్ ప్రభుత్వం ‘ఎక్స్’ను అడగలేదు. అసలు ఎందుకు నిలిపివేయాల్సి వచ్చిందని ఇప్పటికే ప్రశ్నించాం. రాయిటర్స్‌కు చెందిన చాలా హ్యాండిల్స్ ఇప్పటికీ భారత్‌లో పని చేస్తున్నాయి. సాంకేతిక సమస్యల కారణంగా ఇలా జరిగి ఉండొచ్చు. పరిష్కారానికి కృషి చేస్తున్నాం’’ అని భారత్ స్పష్టం చేసింది.
Also Read : BRICS Summit: ‘గ్లోబల్ సౌత్’కు అన్యాయం – బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ
