ముంబై : టాటా ఐపీఎల్ 2026 మెగా టోర్నీ మరింత రసవత్తరంగా మారింది. ప్లే ఆఫ్స్ కు నాలుగు జట్లు ఇప్పటికే చేరుకున్నాయి. టాప్ లో బెంగళూరు, హైదరాబాద్, రాజస్థాన్ , పంజాబ్ , గుజరాత్ టైటాన్స్ , ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ కొనసాగుతున్నాయి. ఇప్పుడు మూడు జట్లు టాప్ లో కొనసాగుతుండగా మరో వైపు ఒకే ఒక్క స్థానం కోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి. ఆ జట్లలో పంజాబ్ , చెన్నై , గుజరాత్, ఢిల్లీ క్యాపిటల్స్. ఉత్కంఠ భరితంగా మారిన ప్లే ఆఫ్స్ కు సంబంధించి ఆయా జట్ల పరంగా చూస్తే ఇంకా కొన్ని మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, మరియు గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2026లో 11 మ్యాచ్‌లలో 14 పాయింట్లతో ఉన్నాయి. 2022లో ఐపీఎల్ 10-జట్ల టోర్నమెంట్‌గా మారినప్పటి నుండి ప్లేఆఫ్ అర్హతకు సాధారణంగా 16 పాయింట్లు అవసరం. ఐపీఎల్ ప్రసారకర్తల ప్రకారం జీటీ, ఆర్సీబీ, , ఎస్ఆర్హెచ్లకు ప్లేఆఫ్ అర్హత సాధించడానికి దాదాపు 80% అవకాశం ఉంది. గ్రూప్ దశకు రెండు వారాల కంటే తక్కువ సమయం మిగిలి ఉంది, కానీ ఇంకా ఏ జట్టు కూడా అర్హత సాధించలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ , గుజరాత్ టైటాన్స్ అన్నీ 11 మ్యాచ్‌లలో 14 పాయింట్లతో ఉన్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి పాలైన పంజాబ్ కింగ్స్ ఇప్పుడు 11 మ్యాచ్‌లలో 13 పాయింట్లతో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్ (రెండూ 11 మ్యాచ్‌లలో 12 పాయింట్లతో) వరుసగా ఐదవ, ఆరవ స్థానాల్లో ఉన్నాయి. జీటీ, ఆర్సిబి, ఎస్ఆర్హెచ్లకు 80 శాతం అవకాశం ఉంది. పిబికెఎస్ (62.5 శాతం), సిఎస్కె (42.7 శాతం) , ఆర్ఆర్ (41.8 శాతం) తదుపరి రౌండ్లకు వెళ్లేందుకు ఫేవరెట్లుగా ఉన్నాయి.